Whatsapp New features
ఈ ఫీచర్‌ని కంపెనీ మార్చి నెలలో ప్రకటించగా.. ప్రస్తుతం బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. అయితే, ఇదిది కొంతమంది యూజర్లను ఉద్దేశించి మాత్రమే విడుదల చేసింది.
ఆండ్రాయిడ్ 2.23.25.20 ఉన్న వాట్సాప్ బీటా యూజర్ల కోసం కంపెనీ ఈ అప్‌డేట్‌ను విడుదల చేసింది. WabetaInfo ప్రకారం.. యూజర్లు వాట్సాప్ అఫిషియల్ చాట్‌కు సంబంధించి యాప్‌లో లేటెస్ట్ అప్‌డేట్స్ అందుకుంటారు.
WabetaInfo వాట్సాప్ అధికారిక చాట్‌లో కొన్ని స్క్రీన్‌షాట్‌లను షేర్ చేసింది. ఈ చాట్‌లో, వినియోగదారులకు కొన్ని ట్రిక్స్‌తో పాటు ప్రైవసీ, సెక్యూరిటీ టిప్స్ పంచుకుంది. స్క్రీన్‌షాట్‌ను చూస్తే.. టూ ఫ్యాక్టర్ వేరిఫికేషన్ ఫీచర్ కూడా ఉంది.
ఈ ఫీచర్‌లో ఉన్న వెసులుబాటు ఏంటంటే.. వాట్సాప్ యూజర్లు అఫిషియల్ చాట్‌లను ఆర్కైవ్ చేయవచ్చు. అవసరమైతే బ్లాక్ కూడా చేయవచ్చు. ఈ చాట్ మాన్యువల్‌గా తెరవబడదు. అంటే యాప్‌లో ఈ చాట్ ఫీచర్ కనిపించే వరకు వేచి ఉండాల్సిందే.
వాట్సాప్ ఈ ఫీచర్ గురించి ప్రస్తుతం ఎటువంటి సమాచారాన్ని అధికారికంగా వెల్లడిచంలేదు. ఇది వినియోగదారులందరికీ అందుబాటులోకి రాదని నివేదికలు చెబుతున్నారు. అయితే, వాట్సాప్ బీటా 2.23.15.10ని అప్‌డేట్ చేసిన యూజర్లు అఫిషియల్ చాట్‌ను యూజ్ చేస్తున్నారు.