
మార్నింగ్ వాక్: మీ రోజును ఆరోగ్యంగా, ఉత్సాహంగా ప్రారంభించాలనుకుంటే మార్నింగ్ వాక్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది మీ జీవక్రియను వేగవంతం చేయడంతో పాటు రోజంతా చురుకుగా ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఉదయం టైమ్ సెట్ చేసుకుంటే, రోజూ కచ్చితంగా నడవడానికి అలవాటు పడతారు.

మధ్యాహ్నం వాక్: డెస్క్ జాబ్ చేసేవారికి, భోజనం తర్వాత వచ్చే బద్ధకాన్ని దూరం చేయడానికి మధ్యాహ్నం నడక చాలా అవసరం. లంచ్ తర్వాత నడిస్తే జీర్ణశక్తి మెరుగవుతుంది. భోజనం తిన్న తర్వాత పడిపోయే శక్తి స్థాయిలను ఇది స్థిరంగా ఉంచుతుంది.

ఈవెనింగ్ వాక్: రోజు మొత్తం పని చేసి అలిసిపోయిన వారికి సాయంత్రం వాకింగ్ ఒక వరం లాంటిది. ఇది మీ టెన్షన్‌ను, ఒత్తిడిని తగ్గిస్తుంది. కార్టిసాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. బిజీ డే తర్వాత మనసుకు ప్రశాంతతనిస్తుంది. రాత్రి భోజనం తర్వాత తేలికపాటి నడక జీర్ణక్రియకు సహాయపడి, మంచి నిద్ర పట్టడానికి ప్రోత్సహిస్తుంది. అయితే నిద్రపోయే ముందు మరీ ఎక్కువగా నడవకూడదు.

ఏ టైమ్ బెస్ట్..?: నడవడానికి అత్యంత ఉత్తమ సమయం అంటూ ఏమీ లేదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అది మీ వ్యక్తిగత షెడ్యూల్‌పై ఆధారపడి ఉంటుంది. మీరు ఏ సమయంలో నడిచినా, అతి ముఖ్యమైన విషయం క్రమం తప్పకుండా నడవడం.

అంతేకాకుండా నడిచేటప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అయితే మంచి ఫలితాలు ఉంటాయి. బాగా నీళ్లు తాగడం, కంఫర్ట్‌గా ఉండే బూట్లు ధరించడం, సురక్షితమైన మార్గాల్లో నడవడం, నడక ముందు, తర్వాత స్ట్రెచింగ్‌లు తప్పనిసరి వంటివి పాటించాలి.