
స్వప్నశాస్త్రం ప్రకారం.. కలలో ఏనుగును చూడటం శుభప్రదంగా పరిగణిస్తారు.. ఈ కలను చూడటం అంటే త్వరలో మీకు గౌరవం, సామాజిక ప్రతిష్ట పెరుగుతుందని సంకేతం. మీరు కలలో ఏనుగు స్వారీ చేస్తుంటే అది శుభసూచకం. అలాంటి కల చూస్తే ఉద్యోగ, వ్యాపారాలలో పురోభివృద్ధి కలుగుతుంది. ఏనుగు స్వర్గానికి రాజైన ఇంద్రుని వాహనం అయిన ఐరావతం కలలో కనిపిస్తే జీవితంలో గొప్ప విజయాలు సాధిస్తారని అర్థం.

మీకు కలలో ఒక జత ఏనుగులు కనిపిస్తే, మీ వైవాహిక జీవితంలో గొప్ప ఆనందం ఉంటుందని అర్థం. గర్భిణీ స్త్రీ తన కలలో ఏనుగును చూస్తే, ఆమె బిడ్డ అదృష్టవంతుడని అర్థం. మరోవైపు మీకు కలలో ఏనుగుల గుంపు కనిపిస్తే, మీరు అన్ని రకాల సమస్యల నుండి బయటపడతారని అర్థం. కలలో ఏనుగుల గుంపును చూడటం భారీ ఆర్థిక లాభాన్ని సూచిస్తుంది.

అంతేకాదు.. ఏనుగు కుంభస్థలం లక్ష్మీదేవి నివాస స్థానంగా నమ్ముతారు. మరి అటువంటి ఏనుగు కలలో కనిపిస్తే.. అది ఎంతో శుభప్రధమని ఆధ్యాత్మికవేత్తలు వివరించారు. ఏనుగులను దర్శించుకోవడం సమస్త పాపాలు, దారిద్య్రం, బాధలు నశించిపోతాయని విశ్వాసిస్తారు.

పుణ్యక్షేత్రాలలో గజ వాహనంగా ఏనుగులు భగవంతుని సేవలలో తరిస్తుంటాయి. గజ ముఖంతోనే వినాయకుడు తొలి పూజలు అందుకుంటాడు. అందరి విఘ్నాలను తొలగిస్తుంటాడు. అలాంటి ఏనుగులు కలలోనే కాదు బయట కనిపించినా కూడా ఇలాంటి ఫలితాలే కలుగుతాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.

స్వప్న శాస్త్రం ప్రకారం కలలో తెల్ల ఏనుగును చూడటం చాలా ప్రయోజనకరంగా చెబుతారు. మీరు కలలో తెల్ల ఏనుగును చూడటం వల్ల మీ గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతుందని సూచిస్తుంది. ఆర్థిక లాభం కూడా పెరుగుతుంది. జీవితంలో ఆనందం, శ్రేయస్సు ఉంటాయి. నమ్మకాల ప్రకారం, కలలో తెల్ల ఏనుగును చూడటం జాతకంలో రాజయోగానికి సంకేతం. ఇది కలలో కనిపిస్తే చాలా అదృష్టంగా భావిస్తారు.