Metabolism Booster: ఇలా చేస్తే మీ జీవక్రియ సక్రమం.. వెంటనే మీ రోజువారీ జీవితంలో చేర్చుకోండి..

|

Aug 10, 2023 | 9:43 AM

జీవక్రియ సక్రమంగా ఉంటే.. శరీరం అంత ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంటుంది. అధిక బరువు సమస్య ఉండదు. అధిక మెటబాలిజం వలన మరింత శక్తివంతంగా ఉంటారు. రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు జీవక్రియపై శ్రద్ధ వహించడం తప్పనిసరి. శరీరంలో ఆహారాన్ని శక్తిగా మార్చడాన్ని జీవక్రియ అంటారు. ఆహారాన్ని జీర్ణం చేయడానికి, రక్త ప్రసరణ కోసం, శ్వాస, హార్మోన్ల సమతుల్యత వంటి పనుల కోసం, శరీరానికి ఆహారం నుండి లభించే శక్తి అవసరం. ఈ శక్తి జీవక్రియ నుండి వస్తుంది. మెటబాలిజం మెరుగ్గా ఉంటే, మీరు మరింత శక్తివంతంగా ఉంటారు.

1 / 6
జీవక్రియ సక్రమంగా ఉంటే.. శరీరం అంత ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంటుంది. అధిక బరువు సమస్య ఉండదు. అధిక మెటబాలిజం వలన మరింత శక్తివంతంగా ఉంటారు. రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు జీవక్రియపై శ్రద్ధ వహించడం తప్పనిసరి.

2 / 6
శరీరంలో ఆహారాన్ని శక్తిగా మార్చడాన్ని జీవక్రియ అంటారు. ఆహారాన్ని జీర్ణం చేయడానికి, రక్త ప్రసరణ కోసం, శ్వాస, హార్మోన్ల సమతుల్యత వంటి పనుల కోసం, శరీరానికి ఆహారం నుండి లభించే శక్తి అవసరం. ఈ శక్తి జీవక్రియ నుండి వస్తుంది. మెటబాలిజం మెరుగ్గా ఉంటే, మీరు మరింత శక్తివంతంగా ఉంటారు.

3 / 6
రోజూ ఉదయాన్నే లేవాలి: ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీ రోజూ ఉదయాన్ని లేవాలి. కంటినిండా నిద్ర పోవాలి. సరిగ్గా నిద్రపోవడం వలన బరువు తగ్గడానికి ఉపకరిస్తుంది. .. ఆరోగ్యకరమైన అల్పాహారం ఆహారాన్ని తీసుకోవాలి.

4 / 6
ఆఫీసు వేళల్లో కూడా చురుకుగా ఉండండి: చాలా మంది ఎక్కువసేపు ఆఫీసుల్లోనే గడుపుతుంటారు. పని ఎక్కువ అవటం, ఇతర కారణాల కారణంగా అలసిపోతున్నారు. ఇలాంటి వారు వ్యాయామం చేయడానికి సమయం ఉండదు. ఈ కారణంగా మీ మెటబాలిజాన్ని మెరుగుపరచడానికి చురుకుగా ఉండేందుకు ప్రయత్నించాలి. పనిలో ఉన్నప్పుడు మధ్య మధ్యలో కాస్త విరామం తీసుకోవాలి. అప్పుడప్పుడు కాసేపు నడవండి. దీని వల్ల బరువు తగ్గడమే కాకుండా పని మీద ఏకాగ్రత పెరుగుతుంది. మధ్యాహ్నం భోజనం పౌష్టికాహారం మాత్రమే తినండి. ఇక సాయంత్రం వేళలో చిప్స్, చాక్లెట్లు, కేకులు వంటి అస్సలు తినకండి.

5 / 6
ఆహారం సరిగ్గా తినండి: ఎక్కువ కేలరీలు బర్న్ చేయడానికి మీకు సహాయపడే కొన్ని ఆహారాలు ఉన్నాయి. ఆహారాన్ని నమలడం, జీర్ణం చేయడం, నిల్వ చేయడం వంటి ప్రక్రియలో మీ శరీరం కేలరీలను బర్న్ చేయాల్సి ఉంటుంది. ప్రోటీన్స్ అధికంగా ఉన్న ఆహారాలు త్వరగా జీర్ణం కావడానికి ఎక్కువ శక్తి అవసరం. ఆహారంలో ఎక్కువ సుగంధ ద్రవ్యాలు కేలరీలను బర్న్ చేయడానికి ఉపయోగపడతాయి. ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా గంటల కొద్దీ ఆకలి వేయదు.  జీవక్రియను నిర్వహించడానికి, కాయధాన్యాలు, తృణధాన్యాలు, గుడ్లు, బీన్స్, నల్ల మిరియాలు, అవోకాడో, కాఫీ, అల్లం మొదలైనవి తీసుకోవచ్చు.

6 / 6
వ్యాయామం: మీ జీవక్రియను మెరుగుపరుచుకోవడానికి వ్యాయామం అత్యంత ప్రభావవంతమైన మార్గం. వ్యాయామం చేయడం ద్వారా మెటబాలిజాన్ని మెరుగుపరుచుకోవచ్చు. వ్యాయామం చేయడం వల్ల శారీరక శక్తి పెరుగుతుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.