
బరువు తగ్గడానికి చాలా మంది జిమ్‌కు వెళ్లడం, రకరకాల డైట్‌లను ఫాలో అవ్వడం చేస్తుంటారు. కానీ మన శరీరానికి ఎంతో ముఖ్యమైన నీటి విషయంలో మాత్రం సరిగ్గా శ్రద్ద వహించరు. ఒక వేళ మీరు బరువు తగ్గాలని చూస్తుంటే.. ఆహారంతో పాటు నీరు త్రాగే విధానంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. భోజనానికి ముందు, తరువాత సరైన విధానంలో నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు వేగంగా కరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

Weight Loss tips

హెల్త్‌లైన్ ప్రకారం: నీరు త్రాగడం వల్ల కేలరీలు వేగంగా కరుగుతాయి. అలాగే ఆకలి కూడా తగ్గుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి నీరు ఎక్కవ తాగలని డాక్టర్లు సజెస్ చేస్తూ ఉంటారు. అయితే కేవలం నీటిని తాగడం వల్లనే కాదు.. దానికి తోడు మీకు సరైన జీవనశైలిని మీరు మెయింటెన్ చేయాలి. మీరు వారానికి 5 నుండి 6 రోజులు కనీసం అరగంట వ్యాయామం చేస్తేనే వాటి ఫిలితాలను పొందగలరని నిపుణులు చెబుతున్నారు.

మధ్యాహ్నం 12 నుంచి 1 గంటల మధ్య తినడం మంచిది. మీరు ఉదయం అల్పాహారం తీసుకోవచ్చు. పోహా, ఉప్మా, చిల్లా, టిక్కీ వంటి వాటిని తినండి.

కేవలం బరువు తగ్గడమే కాకుండా నీరు తాగడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో జీవక్రియ రేటు వేగవంతం అవుతుంది. ఇది కేలరీలను త్వరగా బర్న్ చేయడానికి సహాయపడుతుంది. భోజనానికి ముందు నీటిని తాగడం వల్ల ఆకలి తగ్గుతుంది. నీరు శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఇది మూత్రం ద్వారా విషాన్ని బయటకు పంపుతుంది. కాబట్టి మీరు సరైన సమయంలో, సరైన మార్గంలో నీరు త్రాగడం అలవాటు చేసుకుంటే, మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు బరువు తగ్గడం సాహయపడుతుంది.