అలసట పాయే..ఆనందం మెదలాయే..ఉపాధి పనిలో పెళ్లి సంబరాలు!

Edited By:

Updated on: Jun 14, 2026 | 6:44 PM

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పెళ్లి వేడుకలుకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వేడుకలకు పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ లేవు, రక రకాల వంటకాలు లేవు.. పచ్చని చెట్ల మధ్య, ఆకాశం పందిరిగా మారి, చెట్టు కొమ్మలే తోరణాలుగా మారి, శ్రమ జీవులలో సంబరాన్ని నింపే వేడుకలు.. ఇలా అనుకుంటున్నారా? ఉపాధి హామీ కూలీలు సంబురంగా చేసుకునే పెళ్లి.

1 / 5

2 / 5
చాలా మంది కూలీలు, కష్టం చేసి, ఎండకు అలిసిపోయి, కాసేపు సేద తీరే సమయంలో, తమలోని కూలీల జంటకు పెళ్లి రోజున పెళ్లి వేడుక నిర్వహించడం జరుగుతుంది. అనేక గ్రామాలలో ఇలా వేడుకలు జరుపుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే మరో వేడుక సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

3 / 5
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణ పురంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి. విరామ సమయంలో కూలీలంతా కూర్చొన్నారు. అదే సమయంలో కూలీగా పనిచేస్తున్న ఆకుల శ్రీను, దుర్గ దంపతుల పెళ్లిరోజు ..ప్రతి రోజూ లాగా ఆ దంపతులు ఉపాధి పనికి వెళ్లారు.

4 / 5
పెళ్లి రోజు అని తెలుసుకున్న తోటి కూలీలు వారికి తెలియకుండా,చెట్లు , పూలు , ఆకులతో ,దండలు ,నుదిటి బాసింగాలు , తలంబ్రాలు తయారు చేశారు. కోలాహల వాతావరణం లో పెళ్లి తంతును ఘనంగా ఆ దంపతులకు చేశారు. దీంతో ఆ ప్రాంతమంతా పండగ వాతావరణం నెలకొంది.

5 / 5
తోటి కూలీలంతా ఒక్కసారిగా ఆ దంపతుల చుట్టూ చేరి. పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్న పూలదండలు వేసి, తీపి పంచి సంతోషాన్ని పంచుకున్నారు. కష్టమైన పని మధ్యలో ఈ చిన్న వేడుక అందరి ముఖాల్లో చిరునవ్వులు తెప్పించింది.రోజు కూలీ చేసుకునే వారైనా, మనసు మాత్రం బంగారం అని ఈ ఘటన చాటి చెప్పింది. పని చేసే చోటే కుటుంబంలా మారిన ఈ సందడి అందరినీ ఆకట్టుకుంది.

Follow Us