4 / 9
కరోనా రెండవ వేవ్ కారణంగా భారత్ దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంది. కరోనా కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం యావత్ దేశాన్ని కుదిపేసింది. ఒక్క రోజులోనే కరోనా కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా ఏప్రిల్ 22, 2021న దేశ రాజధాని న్యూ ఢిల్లీలో కరోనా కారణంగా చనిపోయిన వారికి సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు. దానికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ ఏడాది విపరీతంగా వైరల్ అయిన ఫోటోల్లో ఈ ఫోటో కూడా ఉంది.