
Wedding

వివాహం అంటే ఇద్దరు వ్యక్తులకు పెళ్లి చేయడమే కాదు.. ఈ వివాహ వేడుక రెండు కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులను ఒకే తాటిపైకి తీసుకువచ్చేలా చేసే ఓ వేడుక. భారతదేశంలో వివాహాలు తరతరానికి అందిస్తూ ఉండే వివాహం అనేక ఆచారాలు, సంప్రదాయాలను కలిగి ఉంటాయి.

ఇలా ఒక ప్రత్యేకమైన సంప్రదాయం హిమాచల్ ప్రదేశ్‌లోని మణికరణ్ లోయలోని పిని గ్రామంలో నేటికీ కొనసాగుతోంది. ఈ సమయంలో వధూవరుల మధ్య ఎటువంటి సంభాషణ ఉండదు. ఈ గ్రామంలో శ్రావణ మాసంలో వివాహం జరిగిన స్త్రీ బట్టలు ధరించకూడదనే ప్రత్యేకమైన సంప్రదాయం పాటిస్తారు. ఈ సమయంలో వధువు పట్టు అనే ఉన్ని వస్త్రాన్ని ధరించడానికి అనుమతి ఉంది.

నవ వరుడు కూడా కొన్ని నియమాలు పాటించాల్సి ఉంది. వివాహం తర్వాత వరుడు మొదటి వారం రోజుల పాటు మద్యం ముట్టుకోకూడదు. వధూవరులు ఈ ఆచారాలను పాటిస్తే వారికి శుభాలు కలుగుతాయని నమ్ముతారు.

మణిపూర్‌లో న్గా థాబా ఒక ప్రత్యేకమైన ఆచారం : మణిపూర్‌లో న్గా థాబా అనేది ఒక ప్రత్యేకమైన ఆచారం. వివాహం క్రతువు న్గా థాబా ఆచారంతో ముగుస్తుంది. ఇక్కడ వధువు, వరుడి కుటుంబాలకు చెందిన మహిళలు రెండు చేపలను నీటిలోకి వదులుతారు

ఈ చేపలు కలిసి ఈత కొడితే.. ఆ జంట సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతారని.. దంపతులు జీవితాంతం సుఖ సంతోషాలతో జీవిస్తారని నమ్ముతారు. సాధారణంగా వరుడి వైపు నుంచి ఇద్దరు మహిళలు , వధువు వైపు నుండి ఒక మహిళ ఈ కత్రువుని నిర్వహిస్తారు, ఈ ఆచారం సామరస్యం.. సాంగత్యాన్ని సూచిస్తుంది.

టమాటాలు పోయడం: ఉత్తరప్రదేశ్‌లో ఒక ప్రత్యేకమైన ఆచారం ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని సరసౌల్‌లోని కొన్ని ప్రాంతాలలో వరుడి కుటుంబంపై గులాబీ రేకులకు బదులుగా టమోటాలు చల్లే ఆచారం వింతగా ఉంటుంది. అయితే ఈ ఆచారం సరదాగా ఉంటుంది.