షాకింగ్: కుక్కపై కోపంతో కాల్పులు జరిపింది.. గురితప్పి కొడుకు శరీరంలోకి బుల్లెట్ దూసుకెళ్లింది..

|

Jun 03, 2021 | 3:22 PM

ఇలాంటి వార్తలను మనం తరచూ వింటూనే ఉంటాం. నమ్మడానికి కాస్త కష్టంగా ఉన్నా.. ఈ మధ్యకాలంలో ఓ వింత కేసు అమెరికాలోని టెక్సాస్‌లో బయటపడింది.

1 / 4
ఒక తల్లి తన ఐదేళ్ల కొడుకును యాక్సిడెంటల్‌గా కాల్చేసిన ఘటన టెక్సాస్ నగరంలో బయటపడింది. హూస్టన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆ యువతి వీధి కుక్కను కాల్చాలనుకుంది. కానీ ఆ బుల్లెట్ కుక్కకు బదులుగా, ఆమె సొంత కొడుకును తాకింది.

2 / 4
 24 ఏళ్ల ఏంజెలియా మియా వర్గాస్ తన కొడుకు, మిగిలిన కుటుంబ సభ్యులతో కలిసి వీధిలో సైక్లింగ్ చేస్తోంది. ఈ సమయంలో పక్కింటి కుక్క అయిన 6 నెలల బ్రూనో కూడా వీధిలో తిరుగుతోంది. అంతే క్షణాల్లో జరగాల్సింది జరిగిపోయింది. అకస్మాత్తుగా కాల్పుల శబ్దం విన్నామని ఇరుగుపొరుగు వారి చెబుతున్నారు.

3 / 4
డిటెక్టివ్ జె. హస్లీ అనే మహిళ.. ఏంజెలియా బ్రూనోపై మూడుసార్లు కాల్పులు జరిపినట్లు చెప్పింది. ఇక అనుకోకుండా ఓ బుల్లెట్ తన కొడుకును తాకింది. ప్రస్తుతం ఆ చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

4 / 4
ఈ సంఘటనపై దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తూ, బ్రూనో యజమాని ఆ రాత్రి పిల్లాడి అరుపులు విన్నట్లు చెప్పారు. ఈ ప్రమాదంలో బ్రూనో కాలికి కూడా స్వల్పంగా గాయమైనట్లు వివరించారు. ప్రస్తుతం పిల్లాడి పరిస్థితి బాగానే ఉందని.. చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.