28 ఏళ్లపాటు కష్టపడి 3 ఎకరాల్లో ఇంటిని నిర్మించిన దంపతులు.. ఆ ఇంటిని చూసేందుకు బారులు తీరిన జనాలు..

|

Sep 03, 2023 | 3:57 PM

ఓ జంట తమ జీవితంలో 28 ఏళ్లపాటు కష్టపడి ఓ ఇంటిని నిర్మించారు. ఇప్పుడా ఇంటిని చూసేందుకు స్థానికులతో పాటు సందర్శకులు కూడా బారులు తీరుతున్నారు. ఆర్టిస్ట్ మైఖేల్ ఖాన్, అతని టెక్స్‌టైల్ ఆర్టిస్ట్ భార్య లెడా లెవాంట్ 1979లో ఈ ఇంటిని నిర్మించడం ప్రారంభించారు. మైఖేల్ దీనికి ఎలిఫెంట్ ఆర్ట్ హౌస్ అని పేరు పెట్టాడు. అంతేకాదు..ఆ ఇల్లు కొన్ని ఎకరాల్లో విస్తరించి ఉంటుంది.

1 / 5
 ఆర్టిస్ట్ మైఖేల్ ఖాన్ 2007లో మరణించడంతో ఆ ఇంటి నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోయింది. దీంతో మైఖేల్‌ భార్య తదుపరి పనులు ప్రారంభించింది. మొత్తానికి ఆ ఇంటిని పూర్తిగా తయారు చేసేందుకు 28 ఏళ్లు పట్టింది. ఇక ఇప్పుడు ఈ ఇంటిని చూసేందుకు ప్రజలు క్యూ కడుతున్నారు. విషయం ఏంటంటే..ఈ విచిత్ర ఇంటి కోసం పూర్తిగా పాతవి, పాడైపోయిన, పనికిరాని వస్తువులను వినియోగించారు.

2 / 5
నివేదికల ప్రకారం.. ఈ ఇంటిని అమెరికాలోని అరిజోనాలో నిర్మించారు. ఇంటి ప్రవేశ ద్వారం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇది కూడా రాళ్లతో నిర్మించారు. అయితే పైకప్పు ఉపరితలం కూడా ఎత్తు తక్కువగా ఉంటుంది. అందులోకి అడుగుపెట్టగానే గుహలోకి ప్రవేశించినట్లుగా అనిపిస్తుంది.

3 / 5
ఈ ఇంటి నిర్మాణాన్ని పూర్తిగా రంగులమయం చేశారు. ఇంట్లో పైకప్పు 25 అడుగులుగా ఉంది. ఈ ఇల్లు మూడు ఎకరాల స్థలంలో విస్తరించి నిర్మించారు. దీంతో పాటు ఇంట్లో కిటికీలు చాలా అందంగా తయారు చేశారు.. ఇంట్లోకి గాలి వెలుతురు కోసం కొన్ని రంధ్రాలు కూడా ఉన్నాయి.

4 / 5
ఇంటి గోడలు సిమెంట్, రాయి, కలప, గాజుతో రబ్బరు, పైపుల సహాయంతో తయారు చేశారు. ఇంటి నేల పూర్తిగా సమంగా ఉండదు.. దీని గురించి లెడా మాట్లాడుతూ, ..తాము ఇదంతా ఆలోచించలేదని చెప్పారు. తాము కేవలం ఒక డాబా, ఉండటానికి ఒక అందమైన ప్రదేశం కోరుకున్నామని చెప్పింది. మట్టి కుండలు, కలప, వంట చేసుకోవటానికి పొయ్యి , నిద్రపోయేందుకు ఒక గదిని ఏర్పాటు చేసుకున్నారు.

5 / 5
 మైఖేల్ ముందుగా వ్యర్థాలతో ఇంటిని నిర్మించాలని మాత్రమే భావించాడు.. అతనికి ఎలాంటి ప్రణాళికలు లేవని చెప్పింది. ప్రకృతి దానికి ఎలాంటి రూపం ఇస్తుందో చూడాలన్నారు. ఇంట్లో కరెంటు, నీరు, ఫోన్ లైన్లు కూడా ఉన్నాయి. ఇక తన ఇంటిని చూసేందుకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారని లేడా చెప్పింది.