
పల్లెటూర్లలో జనాలు పొలం పనులు చేస్తూ అలిసిపోతుంటారు. అలాంటి సమయంలో మీరు ఈ పచ్చడి తింటే ఇమ్యూనిటీ డబుల్ అవుతుంది. స్టవ్ వెలిగించే పనే లేదు అలాగే ఆయిల్ కూడా అవసరం లేదు. దీనిని చేసుకున్న తర్వాత వేడివేడి అన్నంతో కలిపి తింటే ఎవరైనా రెండు ప్లేట్స్ లాగించాల్సిందే.

పొలం పచ్చడికి కావాల్సిన పదార్థాలు : 100 గ్రాముల చింతపండు, 5 పచ్చిమిర్చి , రెండు కప్పుల ఉల్లిపాయ ముక్కలు, ఐదు వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగినంత ఉప్పు, ఒక కట్ట కొత్తిమీర తరుగు, అర టీ స్పూన్ జీలకర్రను తీసుకోవాలి. వంట రాని వాళ్ళు కూడా ఈ పచ్చడిని ఈజీగా చేసుకోవచ్చు. సరైన కొలతలతో చేస్తే రుచిగా ఉంటుంది.

పొలం పచ్చడి తయారీ విధానం స్టెప్ 1 : మీరు ముందుగా 5 పచ్చిమిర్చిని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. వీటితో పాటు 100 గ్రాములు చింతపండు తీసుకొని ఒక చిన్న గిన్నె తీసుకుని దానిలో కొంచం నీళ్లు పోసి దీనిని బాగా నానబెట్టుకోవాలి.

పొలం పచ్చడి తయారీ విధానం స్టెప్ 2 : ఈ మిశ్రమంలోకి నాలుగు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని వేస్తే రుచికరంగా ఉంటుంది. ఆ తర్వాత ఉల్లిపాయను తీసుకుని సన్నగా కట్ చేసుకోవాలి. ఇక ఇప్పుడు రోటిలో కొంచం జీలకర్రను వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకుంటే ఆ రుచే వేరబ్బా. ఎప్పడైతే ఇది వేస్తారో అప్పుడు టేస్ట్ పెరుగుతుంది.

ఇప్పుడు దీనిలో కొంచం చింతపండు తీసుకుని రుబ్బుకోవాలి. ఇంకా దీనిలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు కూడా వేయాలి. పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా దంచుకోవాలి. దీనిలో నాలుగు ఉల్లిపాయ ముక్కలు కూడా నూరాలి. అంతే, పొలం రోటి పచ్చడి రెడీ. మీరు దీని కోసం ఎలాంటి పొయ్యి ముట్టించాల్సిన అవసరం లేదు.