
జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాలు నక్షత్ర సంచారం చేయడం చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. అయితే ఆగస్టు 31వ తేదీనా శుక్రుడు పూర్వ ఫల్గుణి నక్షత్రంలోకి సంచారం చేయనున్నాడు. ఇది పన్నెండు రాశులపై ప్రభావం చూపుతుంది. దీని వలన కొన్ని రాశుల వారికి అద్భతమైన ప్రయోజనాలు చేకూరితే, మరికొన్ని రాశుల వారు ఎక్కువ నష్టాలు ఎదుర్కోనున్నారు.

మరీ ముఖ్యంగా ఆగస్టు31వ తేదీలోనే సూర్యుడు కూడా అదే నక్షత్రంలోకి సంచారం చేయడం వలన వీరికి చాలా ఇబ్బందులు ఎదురు అవుతాయంట. కొన్ని సార్లు ఎవరూ చెప్పినా వినకుండా కొన్ని సమ్యలు ఎదుర్కోవడమే కాకుండా ఇబ్బందుల్లో చిక్కుకుంటారంట. కాగా, ఆ రాశులు ఏవో చూసేద్దాం.

కుంభ రాశి : శుక్రుడి నక్షత్ర సంచారం వలన ఈ సమయంలో కుంభ రాశి వారు ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటారు. అంతే కాకుండా వీరికి కుటుంబ సభ్యుల నుంచే వ్యతిరేఖత ఎక్కువ అవుతుంది. చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీరికి తెలియకుండానే వీరు అవమానాలు పడాల్సి వస్తుంది. అన్ని విధాలుగా వీరికి వ్యతిరేఖత పెరుగుతుంది.

మీన రాశి : మీన రాశి వారు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీరు ఏ పని చేయాలి అనుకుంటారో అది మధ్యలోనే ఆగిపోతుంది. దీంతో మానసికంగా చాలా కుంగిపోతారు. కుటుంబ సభ్యులు కూడా మాటలతో బాధపెడతారు. వీరికి ఎలాంటి సపోర్ట్ లేకుండా ఉంటుంది. అన్ని విధాలుగా ఇబ్బందులు తలెత్తుతాయి.

ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. కానీ దానికి మించి ఖర్చులు అవుతాయి. దీంతో వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంతే కాకుండా వీరికి చాలా రోజుల నుంచి రావాల్సిన డబ్బులు కూడా ఆగిపోతాయి. దీంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. పెద్దల మాటను లెక్క చేయకుండా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి మోసపోయి, నష్టాలు ఎదుర్కొనే ఛాన్స్ ఉన్నదంట.