
ఇప్పుడు అందరూ ఇంట్లో మొక్కల్ని విరివిగా పెంచుకుంటున్నారు. వారిని నచ్చిన ప్లాంట్స్‌ని తీసుకొచ్చి ఇంట్లో అందంగా అలంకరిస్తున్నారు. ఎవరి టేస్టుకు తగ్గట్టు పూల మొక్కలు, క్రోటాన్స్ వంటివి తెచ్చుకుంటారు. ఇప్పుడు ఎక్కువగా ఇండోర్ ప్లాంట్స్ వైపు మొగ్గు చూపిస్తున్నారు.

ఈ ఇండోర్ ప్లాంట్స్ వల్ల ఇంటికి కూడా కొత్త అందం వస్తుంది. అయితే ఇప్పుడు చాలా ఎక్కువ.. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని కలిగించే మొక్కల్ని పెంచుకుంటాన్నారు. వాటిల్లో ఈ స్నేక్ ప్లాంట్ కూడా ఒకటి.

మనీ ప్లాంట్ తర్వాత.. చాలా మంది ఈ స్నేక్ ప్లాంట్‌ని ఇంట్లో పెట్టుకుంటున్నారు. ఇది ఇండోర్ ప్లాంట్. ఆఫీసులో కూడా పెట్టుకోవచ్చు. అంతే కాకుండా స్నేక్ ప్లాంట్ ఆక్సిజన్‌ని విడుదల చేస్తుంది. వాస్తు ప్రకారం కూడా ఇది పెట్టుకోవడం వల్ల అనేక బెనిఫిట్స్ ఉన్నాయట.

స్నేక్ ప్లాంట్‌ని వాస్తు ప్రకారం.. దక్షిణ దిశలో ఉంచాలట. ఈ దిశలో మొక్కను పెట్టుకోవడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి.. పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుందట. అలాగే ఈ మొక్కను ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసుకుంటే.. కుటుంబ సభ్యుల బంధం బలపడుతుంది.

ఈ మొక్కను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఐశ్వర్యం, అదృష్టం కూడా కలిసి వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు. అలాగే ఈ మొక్కను బాత్రూమ్, బెడ్ రూమ్‌లలో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ మొక్క వల్ల గాలి కలుషితం కాకుండా ఉంటుంది.