పరమ శివుడిని పెళ్లి చేసుకున్న యువతి..! ఫొటోలు వైరల్

|

Jul 25, 2023 | 7:15 AM

ఓ యువతి పరమ శివుడిని పెళ్లి చేసుకుంది. భగవంతుడిపై భక్తితో ఆయన్ను భర్తగా స్వీకరిచించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో ఈ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. దీంతో స్థానికంగా ఈ ఘటన చర్చనీయంగా మారింది..

1 / 5
ఓ యువతి పరమ శివుడిని పెళ్లి చేసుకుంది. భగవంతుడిపై భక్తితో ఆయన్ను భర్తగా స్వీకరిచించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో ఈ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. దీంతో స్థానికంగా ఈ ఘటన చర్చనీయంగా మారింది.

2 / 5
ఝాన్సీ జిల్లా అన్నపూర్ణ కాలనీకి చెందిన యువతి, ఆమె తల్లిదండ్రులు చాలా కాలంగా బ్రహ్మకుమారి ఆశ్రమంలో సభ్యులుగా ఉంటున్నారు. శివుడిపై భక్తి పారవశ్యంతో ఆయన్నే పెళ్లి చేసుకుంటానని యువతి పట్టుబట్టింది.

3 / 5
తన జీవితాన్ని పరమశివుడికి అంకితం చేయాలని సదరు యువతి నిశ్చయించుకుంది. చేసేదిలేక తల్లిదండ్రులు కూడా అందుకు అంగీకరించారు. తమ కుమార్తె వివాహాన్ని సంప్రదాయం ప్రకారం నిర్వహించాలనుకున్నారు ఆమె కుటుంబ సభ్యులు.

4 / 5
నెల రోజులు ముందుగానే ఏర్పాట్లను ప్రారంభించారు. వివాహ ఆహ్వాన పత్రికలు ముద్రించి బంధువులందరికీ ఆహ్వానం పలికారు. ఈ క్రమంలో ఆదివారం (జులై 23) సాయంత్రం 5 గంటలకు బడగావ్ గేట్ వెలుపల ఉన్న కళ్యాణ మండపంలో పరమశివుడితో ఆ యువతి పెళ్లి జరిపించారు.

5 / 5
వధువు శివలింగానికి వరమాల సమర్పించి తన భర్తగా అంగీకరించింది. అనంతరం శివలింగాన్ని రథంపై ఊరేగించారు. వివాహానికి విచ్చేసిన బంధుజనానికి వింధు భోజనం కూడా ఏర్పాటు చేశారు.