Thick Eyebrows: హరివిల్లు లాంటి ఒత్తైన కనుబొమ్మలు కావాలా? రోజు నిద్రపోయే ముందు ఇలా చేశారంటే..

|

Sep 18, 2023 | 12:20 PM

అందమైన కనుబొమ్మలు కూడా ముఖ సౌందర్యాన్ని పెంచడంలో సహాయపడతాయి. ఇంద్ర ధనుస్సు లాంటి ఒత్తైన కనుబొమ్మలను ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. కానీ చాలా మందికి కనుబొమ్మలు పలుచగా, సన్నగా ఉంటాయి. మందపాటి కనుబొమ్మలను థ్రెడింగ్ చేయడం వల్ల చక్కని ఆకృతి వస్తుంది. కానీ సన్నని కనుబొమ్మలను థ్రెడ్ చేయడం వల్ల ముఖంలో..

1 / 5
అందమైన కనుబొమ్మలు కూడా ముఖ సౌందర్యాన్ని పెంచడంలో సహాయపడతాయి. ఇంద్ర ధనుస్సు లాంటి ఒత్తైన కనుబొమ్మలను ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. కానీ చాలా మందికి కనుబొమ్మలు పలుచగా, సన్నగా ఉంటాయి. మందపాటి కనుబొమ్మలను థ్రెడింగ్ చేయడం వల్ల చక్కని ఆకృతి వస్తుంది. కానీ సన్నని కనుబొమ్మలను థ్రెడ్ చేయడం వల్ల ముఖంలో పెద్దగా మార్పు ఉండదు. చిక్కటి కనుబొమ్మలను పొందాలంటే ఇంట్లో దొరికే ఈ వస్తువులతో రోజూ ఇలా చేయండి. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.

2 / 5
కనుబొమ్మలు మందంగా మారడానికి ఆముదం చాలా ఉపయోగపడుతుంది. ప్రతి రాత్రి కనుబొమ్మలకు ఆముదం రాసుకుని నిద్రపోండి. ఆముదం మీ కనుబొమ్మలను మందంగా, చిక్కగా మారడం మీరు చూస్తారు. ఆముదం ఎక్కువ గాఢత కలిగి ఉంటుంది. ఈ నూనెను వాడటం వల్ల చేతులు, కనుబొమ్మలు అతుక్కుపోతాయి. అందుకే చాలా మంది ఆముదం వినియోగించడానికి ఇష్టపడరు.

3 / 5
ఆముదంకు బదులుగా కొబ్బరి నూనెను కూడా కనుబొమ్మలను చిక్కగా చేయడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. ఆతా కనుబొమ్మలు మందంగా, ఒత్తుగా మార్చడానికి ఉపయోగపడుతుంది. రాత్రిపూట ఆముదంకి బదులు కొబ్బరినూనె రాసుకుని నిద్రపోవచ్చు.

4 / 5
ముఖానికి నూనెలు రాసుకోవడం ఇబ్బంది అయితే సమస్య కలబందను ప్రత్యామ్నాయంగా వినియోగించవచ్చు. కనుబొమ్మలపై అలోవెరా జెల్‌తో మసాజ్ చేసుకోవాలి. 30 నిమిషాల పాటు అలాగే ఉంచి ముఖం కడుక్కుంటే సరి. ఇది కూడా కనుబొమ్మలను మందంగా పెంచడంలో సహాయపడుతుంది.

5 / 5
ఆముదం, కొబ్బరి నూనె, కలబంద గుజ్జుతోపాటు ఉల్లిపాయ రసాన్ని కూడా వినియోగించవచ్చు. కనుబొమ్మలకు ఉల్లిరసాన్ని పూసుకుని 15 నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత ముఖం కడుక్కోవాలి. ఇందులోని సల్ఫర్ కనుబొమ్మలను దట్టంగా పెంచడంలో సహాయ పడుతుంది.