
మీ ఉదయాన్ని పోషకాలు కలిగిన బ్రేక్‌ఫాస్ట్‌తో స్టార్ట్ చేయడం ద్వారా మీకు రోజంతా శక్తి లభిస్తుంది. ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అలాగే ఆకలి బాధలను తగ్గిస్తుంది. చాలా మంది బ్రేక్ ఫాస్ట్‌లో పోహా, ఉప్మాను తింటుంటారు. ఈ రెండింటిలోనూ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో తక్కువ కేలరీస్ ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇవి మంచి ఎంపికలు

పోహా, ఉప్మా రెండూ తక్కువ కేలరీలు కలిగిన బ్రేక్‌ఫాస్ట్‌లు. అయినప్పటికీ వాటి కేలరీల కంటెంట్‌లో స్వల్ప తేడా ఉంది. ఉదాహరణకు, 100 గ్రాముల పోహాలో దాదాపు 180 నుండి 200 కిలో కేలరీలు ఉంటాయి, అయితే 1 ప్లేట్ ఉప్మాలో 220 కిలో కేలరీలు ఉంటాయి. అయితే, ఉపయోగించిన పదార్థాలను బట్టి కేలరీల కంటెంట్ పెరుగుతుంది

పోహ అనేది వివిధ రకాల పోషకాలను కలిగి ఉన్న బ్రేక్‌ఫాస్ట్. ఇందులో ఎక్కువ మొత్తంలో ఐరన్ ఉంటుంది, ఇది రక్తహీనతతో పోరాడటానికి సహాయపడుతుంది. ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది. ఇది ఆకలిని అరికట్టడంలో సహాయపడుతుంది. అలాగే బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. అల్పాహారంలో పోహా తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

ఉప్మా అనేది ఆవాలు, కరివేపాకు, కొన్ని కూరగాయలతో తయారుచేసే బ్రేక్‌ఫాస్ట్. ఇది సులభంగా జీర్ణమవుతుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఉప్మా శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. దీనిలోని కార్బోహైడ్రేట్లు శక్తిని అందిస్తాయి. అలాగే ఇది ఎక్కువ సమయం కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది.ఉప్మాలో కూరగాయలు జోడించడం వల్ల దాని పోషక విలువ పెరుగుతుంది.

పావు VS ఉప్మా ఏది బెస్ట్: పోహా, ఉప్మా రెండూ వాటి ఆరోగ్యకరమైనవే. ఈ రెండింటిలో దేని ప్రయోజనాలు దానికి ఉన్నాయి. ఉదాహరణకు, బరువు తగ్గాలనుకున్న వ్యక్తులకు పోహా మంచి ఎంపిక. ఎందుకంటే ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరచడానికి, రోజంతా శక్తివంతంగా ఉండటానికి ఇది సహాయ పడుతుంది. ఇక ఉప్మాలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, విటమిన్ల పుష్కలంగా ఉంటాయి. కాబట్టి మీ అవసరాలను బట్టి మీకు ఏది ఉత్తమమో అనేది నిర్ణయించుకోండి.