
చాలా మంది ఇంటిలో ప్లాస్టిక్ డబ్బలు ఉంటాయి. అయితే వాటిని ఉపయోగించగా, వాటి కొన్ని సార్లు పాడై పోవడమే లేదా పగలి పోవడం జరుగుతుంది. దీంతో వాటిని తీసి బయటపారేస్తారు. కానీ పగిలిపోయిన ఈ పాత బుట్టలను ఉపయోగించి, ఇంటిని అందంగా మార్చుకోవచ్చునంట. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం పదండి.

వంట గదిలో లేదా గదులలో ఉండే ప్లాస్టిక్ డబ్బాలు పగిలిపోతే వాటికి కొత్త రూపం ఇవ్వవచ్చునంట, చాలా మంది వస్తువులను భద్రంగా దాచుకోవడానికి ప్లాస్టిక్ బుట్టలు లేదా వెదురు, తీగల బుట్టలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కానీ కొన్ని సార్లు వాటి అంచులు విరిగిపోవడం, అవి పాడైపోవడం, పగిలిపోవడం జరుగుతుంది. దీంతో తీసి వాటిని వెంటనే బయట పారేస్తాం. కానీ వాటితో కూడా ఇంటికి ఉపయోగపడే అదమైన వస్తువులు రెడీ చేసుకోవచ్చునంట.

పగిలిన ప్లాస్టిక్ బుట్టలతో మీరు వేలాడే అందమైన కుండీలను తయారు చేసుకోవచ్చును. దీని కోసం మీరు కొన్ని వస్తువులు కొనుగోలు చేయాల్సి వస్తుంది. జనపదారం, ఫెవికాల్, ఆకులు, రంగు రంగుల ఫాల్తిన్ కవర్. వీటన్నింటిని ఉపయోగించి, బుట్టలోపల ఫాల్తిన్ కవర్ అతికించి, అందులో మట్టి వేసి, పైన జనపదారం కట్టి, అందులో అందమైన మొక్కను నాటుకొని వేలాడదీయవచ్చు. లేదా ప్లాస్టిక్ ఫ్లవర్స్ పెట్టి, దానిని అందంగా ఇంటిలో వేలాడదీయండి. దీని వలన ఇంటికి కల వస్తుంది.

అదే విధంగా విరిగిన బుట్టలో సగభాగాన్ని కట్ చేసి, మీరు అందమైన గోడ ఆర్గనైజర్‌ను కూడా తయారు చేయవచ్చును. దీని కోసం విరిగిన బుట్టకు అందమైన రంగు వేసి, గోడకు అంటించే మేకులను తీసుకోని వాటిని అంటించాలి, అదే విధంగా తాడు సహాయంతో వేలాడదీయాలి. అంతే ఇది చూడటానికి చాలా అందంగా, అద్భుతంగా ఉంటుంది.

పగిలిన బుట్టలతో టేబుల్ లేదా క్యాండిల్ ల్యాంప్.. పగిలిన లేదా విరిగిన బుట్టలతో టేబుల్ లేదా క్యాండిల్ ల్యాంప్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చును. దీని కోసం మీరు క్యాండిల్ హోల్డర్‌ను తయారు చేసుకోవాలి. దాని నుంచి తీగను తీసి , దానికి అందంగా పెయింట్ స్ప్రే చేయాలి. తర్వాత బ్యాటరీ లైట్ అమర్చాలి. లేదా కొవ్వొత్తిని పెట్టాలి. అంతే అందమైన టేబుల్ ల్యాంప్ రెడీ.