
మనం తినకపోతే కొద్దీ రోజులు ఉండగలం, నీళ్ళు తాగకుండా కూడా బతకగలం. మరి, ఏడాది పాటు పవర్ లేకపోతే ఉండగలమా ? ఇది వినడానికి షాకింగ్ లాగా ఉన్నా ఇలాంటి పరిస్థితి ఎదురైతే మనిషి ఎలా ఉంటారో ఇక్కడ చూద్దాం..

ముందు ఫోన్ల నుంచి బయటపడతాము. ఛార్జింగ్ ఉన్న రోజులు వాటిని వాడుతాము. అది అయిపోయాక మెసేజ్, వాట్సాప్ , డేటా, ఇంటర్నెట్ ఇలా మొత్తం పోతుంది. ఇక చేసేదేం లేక కొత్త అలవాట్లను నేర్చుకుంటాము.

ప్రతి మార్కెట్లో కరెంటుతోనే ఆహారాలన్ని తయారు చేస్తూన్నారు. చేశాక వాటిని మళ్ళీ స్టోర్ చెయ్యడానికి పవర్ కచ్చితంగా కావాలి. లేకపోతే ఫుడ్ మొత్తం వేస్ట్ అవుతుంది.

ఒక వేళ విద్యుత్ ఏడాది పాటు లేకపోతే రైతులు వ్యవసాయం కూడా చెయ్యలేరు. ఎందుకంటే, పంటలు పండాలంటే మోటార్లు అవసరం. మనిషి తాగడానికి కూడా బావిలో ఉన్న నీళ్ల మీద ఆధారపడతారు.

కరెంట్ లేకపోతే ఎలా బతకాలో నేర్చుకుంటాము. ఇక మన పాత రోజులు మొత్తం గుర్తుకు వస్తాయి. అప్పుడు ఫోన్లు కూడా ఉండవు. జంతువులు మనుషులకు స్నేహితులుగా మారతాయి.