Twins: ఇలాంటి వారికి కవల పిల్లలు పుడతారట? ఇందులో మీరూ ఉన్నారేమో చెక్‌ చేసుకోండి

|

Apr 03, 2024 | 8:47 PM

పిల్లల పుట్టుక ఏ కుటుంబానికైనా సంతోషాన్నిస్తుంది. అయితే కవల సంతానం కలిగినప్పుడు చాలా మంది ఆందోళన చెందుతారు. కవలలు అంటే ఒకేసారి ఇద్దరు పిల్లలు పుట్టడం. అంటే పిల్లలపై శ్రద్ధ, వారిని పెంచడానికి అయ్యే ఖర్చు రెట్టింపు అవుతుంది. అందుకే చాలా మంది కవల పిల్లలు పుడితే ఆందోళన చెందుతుంటారు. కవలలు రెండు రకాలుగా ఉంటారు. ఒకేలా కనిపించే కవలలు, ఒకేలా కనిపించని కవలలు. ఒకేలాంటి కవలల విషయంలో..

1 / 5
పిల్లల పుట్టుక ఏ కుటుంబానికైనా సంతోషాన్నిస్తుంది. అయితే కవల సంతానం కలిగినప్పుడు చాలా మంది ఆందోళన చెందుతారు. కవలలు అంటే ఒకేసారి ఇద్దరు పిల్లలు పుట్టడం. అంటే పిల్లలపై శ్రద్ధ, వారిని పెంచడానికి అయ్యే ఖర్చు రెట్టింపు అవుతుంది. అందుకే చాలా మంది కవల పిల్లలు పుడితే ఆందోళన చెందుతుంటారు.

2 / 5
కవలలు రెండు రకాలుగా ఉంటారు. ఒకేలా కనిపించే కవలలు, ఒకేలా కనిపించని కవలలు. ఒకేలాంటి కవలల విషయంలో అండం, శుక్రకణాల కలయిక తర్వాత.. అది విచ్ఛిన్నమై తల్లి గర్భంలో రెండు జైగోట్‌లుగా ఏర్పడుతుంది. ఈ కారణంగా ఒకేలా కనిపించే కవలలు పుడతారు. ఒకేలా లేని కవలల విషయంలో అలా జరగదు. రెండు అండాలు కలిసి ఫలదీకరణం చేందుతాయ.

3 / 5
ఇక ఎవరికి కవలలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనే విషయానికొస్తే.. చాల మంది మా కుటుంబంలో ఎక్కువ మంది కవలలు ఉన్నారని చెబుతుంటారు. ఇది పూర్తిగా తప్పు కాదు. ఎందుకంటే కవలలు పుట్టడానికి జన్యుపరమైన కారణం ముఖ్యమైనది.

4 / 5
అంటే, ఏదైనా ఒక కుటుంబంలో గతంలో కవలలు పుట్టిన చరిత్ర ఉంటే, ఆ కుటుంబంలో కవలలు పుట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మీ కుటుంబంలో కవల సోదరి లేదా సోదరుడు ఉన్నట్లైతే మీకు కూడా కవలలు పుట్టే అవకాశం ఉంది.

5 / 5
తల్లి తరపు కుటుంబంలో కవలల చరిత్ర ఉంటే.. కవలలు పుట్టే అవకాశాలు చాలా వరకు పెరుగుతాయి. అలాగే తల్లి వయస్సు 35 నుంచి 40 ఆపై వయసు ఉంటే వారికి కూడా కవలలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ స్త్రీల శరీరంలో హార్మోన్ల మార్పులు సంభవిస్తాయి. యుక్తవయస్సు చివరిలో చాలా మంది శరీరంలో అండోత్సర్గము కూడా పెరుగుతుంది. ఇది కవలలు పుట్టే అవకాశాలను కూడా పెంచుతుంది. అంతేకాకుండా సంతానలేమి చికిత్స కోసం రకరకాల మందులు వాడే వారు లేదా IVF విధానాన్ని ఆశ్రయించేవారికి కూడా కవలలు పుట్టే సంభావ్యత ఉంది.