Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం

Edited By:

Updated on: Oct 10, 2026 | 4:55 PM

వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన.. అన్న నానుడికి నిదర్శనంగా తిరుమల శ్రీవారి క్షేత్రం భక్తుల ఆకలి తీర్చే అన్నపూర్ణ నిలయంగా భాసిల్లుతోంది. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ నిత్య అన్నప్రసాద సేవను అక్షయపాత్రలా కొనసాగిస్తోంది. 2026 జనవరి 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు కేవలం 9 నెలల వ్యవధిలోనే వివిధ కేంద్రాల ద్వారా ఏకంగా 9 కోట్లకు పైగా సర్వింగ్స్ అందించి రికార్డు సృష్టించింది. సాధారణ రోజుల్లో 1.80 లక్షల నుంచి 1.90 లక్షల మంది, వారాంతాలు, రద్దీ దినాల్లో 3 లక్షలకు పైగా భక్తులు అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు.

1 / 6
1985లో ప్రారంభమైన మహాయజ్ఞం:  తిరుమలలో ఆకలితో ఉన్న భక్తుడికి అన్నం అందించే లక్ష్యంతో 1985 ఏప్రిల్ 6న అప్పటి సీఎం ఎన్టీఆర్ సంకల్పంతో శ్రీ వేంకటేశ్వర నిత్యాన్నదాన పథకం ప్రారంభమైంది. ఆ తర్వాత 1994 ఏప్రిల్ 1న దీనిని ట్రస్టుగా మార్చారు. ప్రస్తుతం శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ పేరిట ఈ సేవలు నిరంతరం కొనసాగుతున్నాయి. భక్తుల విరాళాలే ఆధారంగా నడిచే ఈ ట్రస్టు వద్ద ప్రస్తుతం రూ.2,900 కోట్లకు పైగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఈ డిపాజిట్లపై వచ్చే ఆదాయంతోనే రోజూ లక్షలాది మందికి ఉచితంగా రుచికరమైన, నాణ్యమైన అన్నప్రసాదాన్ని టీటీడీ అందిస్తోంది.

2 / 6
24 గంటల సేవల్లో మూడు ప్రధాన వంటశాలలు: తిరుమలలో అన్నప్రసాద వితరణ కోసం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం, శ్రీ అక్షయ వంటశాల, వకుళమాత వంటశాలలు 24 గంటలూ శ్రమిస్తున్నాయి. తరిగొండ వెంగమాంబ కేంద్రంలో రోజుకు 80 వేల మందికి పైగా భక్తులకు ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం మరియు రాత్రి అన్నం, కూర, చట్నీ, వడ, సాంబార్, రసం, మజ్జిగ, స్వీట్ పొంగల్ వడ్డిస్తున్నారు. శ్రీ అక్షయ వంటశాలలో వివిధ రకాల ఉప్మాలు, సాంబారన్నం, పెరుగన్నం, టమోటా రైస్, పాలు, టీ తయారు చేస్తుండగా.. వకుళమాత వంటశాల ద్వారా యాత్రికుల వసతి సముదాయాలు, CRO, రామ్‌భగీచా, అంజనాద్రి నిలయం వంటి ప్రాంతాలకు ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు.

3 / 6
క్యూలైన్లలోనూ ఆగని నిరంతర అన్నప్రసాద వితరణ: స్వామివారి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి వేచి ఉండే సమయంలో ఆకలితో ఇబ్బంది పడకుండా చూడటమే అన్నప్రసాద విభాగం ప్రధాన లక్ష్యం. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు, క్యూలైన్ల వెలుపల ఏర్పాటు చేసిన కేంద్రాలు, పీఏసీ  భవనాల్లో వేచి ఉన్న భక్తులకు సిబ్బంది నిరంతరాయంగా ఆహారం, పానీయాలు అందజేస్తున్నారు. పర్వదినాల్లో సాధారణ ఆహారంతో పాటు మజ్జిగ, బాదం పాలు, బిస్కెట్లు, జ్యూస్ ప్యాకెట్లను సైతం పంపిణీ చేస్తున్నారు. తిరుమలలోనే కాక దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ అనుబంధ ఆలయాల్లోనూ ఈ సేవలను విస్తరించారు.

4 / 6
రోజుకు దాదాపు 16 టన్నుల బియ్యం: రోజూ లక్షలాది మందికి భోజనం సమకూర్చేందుకు టీటీడీ నిత్యం భారీ స్థాయిలో ముడిసరుకులను వినియోగిస్తోంది. ప్రతిరోజూ దాదాపు 15,788 కిలోల (15.8 టన్నుల) బియ్యం, 3,110 కిలోల సన్‌ఫ్లవర్ ఆయిల్, 2,861 కిలోల కందిపప్పు, 2,832 కిలోల సుజీ రవ్వ, 2,825 కిలోల గోధుమ రవ్వ, 1,729 కిలోల మినప్పప్పు వాడుతున్నారు. వీటితో పాటు నిత్యం 1,436 కిలోల ఉప్పు, 1,276 కిలోల బెల్లం, 497 కిలోల చింతపండు, 430 కిలోల చక్కెర, 309 కిలోల ఎండుమిర్చి, 209 కిలోల ధనియాలు, సుమారు 4,375 కొబ్బరికాయలను అన్నప్రసాదాల తయారీకి వినియోగిస్తున్నారు.

5 / 6
నిరంతరం శ్రమిస్తున్న సిబ్బంది, సేవకులు: భక్తులకు సేవలందించేందుకు టీటీడీ ఆధునిక సాంకేతికతను జోడిస్తోంది. 2024లో వకుళమాత సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా అదనంగా 28 ప్రాంతాలకు ఆహార పంపిణీని విస్తరించింది. PAC-5 లో ఒకేసారి 1,500 మంది భోజనం చేసే డైనింగ్ హాళ్లను అందుబాటులోకి తెచ్చింది. రోజుకు 2 లక్షల మందికి సరిపడా ఆహారం వండే శాటిలైట్ ఆటోమేటెడ్ కిచెన్, MTVACలో ఆధునిక వంట పరికరాలు, విరాళాల కోసం క్యూఆర్ కోడ్ కియోస్క్‌లను ఏర్పాటు చేస్తోంది. ఈ మహా యజ్ఞంలో వెయ్యి మందికి పైగా అన్నప్రసాద విభాగం సిబ్బంది, మరో వెయ్యి మంది శ్రీవారి సేవకులు సమన్వయంతో నిరంతరం సేవలందిస్తున్నారు.

6 / 6
శ్రీవారి సన్నిధికి వచ్చే ప్రతి భక్తుడు కడుపు నిండా భోజనం చేసి తృప్తిగా స్వామివారి దర్శనం చేసుకోవాలన్న సంకల్పంతో టీటీడీ కొనసాగిస్తున్న ఈ అన్నప్రసాద సేవ తిరుమలను నిజమైన అన్నపూర్ణ నిలయంగా నిలబెడుతోంది. శ్రీవారి క్షేత్రంలో ఆకలితో వచ్చే భక్తుడికి అన్నం అందించడం కేవలం సేవ మాత్రమే కాదు భక్తుడిలో భగవంతుడిని చూసే భారతీయ సనాతన సంప్రదాయానికి ప్రత్యక్ష ప్రతిరూపం గా టిటిడి నిత్య అన్నదాన ప్రసాదం అందిస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us