
హానికరమైన UV కిరణాలు శరీరంపై పడటం వల్ల చర్మం, మొహంపై టానింగ్ సమస్య పెరుగుతుంది. టానింగ్‌ను తొలగించడానికి మీరు కొన్ని సహజమైన వస్తువులను ఉపయోగించవచ్చు. ఈ చిట్కాలు మీ చర్మాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. దీంతోపాటు మొహం కూడా తళతళలాడుతుంది.

Aloe Vera

శనగ పిండి - పెరుగు: ఒక గిన్నెలో ఒక చెంచా శనగ పిండిని తీసుకోండి. దానికి 2 చెంచాల పెరుగు కలపండి. దానికి కొంచెం అలోవెరా జెల్ కలపండి. వీటన్నింటిని మిక్స్ చేసి ముఖం, మెడకు అప్లై చేయండి. 30 నిమిషాలు అలాగే ఉండనివ్వండి. ఆ తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి.

పసుపు - శెనగపిండి: ఒక గిన్నెలో అర టీస్పూన్ పసుపు తీసుకోండి. అందులో ఒక చెంచా శెనగపిండి కలపాలి. దానికి కాస్త పెరుగు జోడించండి. వీటన్నింటిని మిక్స్ చేసి ముఖం, మెడకు అప్లై చేయండి. ఇది 20 నుండి 30 నిమిషాల వరకు ఉంచి.. నీటితో శుభ్రం చేసుకోండి.

పెసర పప్పు - టొమాటో: పెసరపప్పును ఒక గిన్నెలో వేసి కొంత సేపు నానబెట్టండి. ఇప్పుడు ఈ పప్పును పేస్ట్‌లా చేసుకోవాలి. దానికి టొమాటో గుజ్జును కలపండి. చర్మంపై అప్లై చేసి.. సుమారు 20 నిమిషాల పాటు ఉంచి నీటితో శుభ్రం చేసుకోవాలి.