చుక్క నూనె లేకుండా మిగిలిపోయిన అన్నంతో చపాతీలు.. ఇలా చేస్తే అదిరిపోవడమే!

Updated on: Sep 18, 2026 | 12:36 PM

రాత్రి మిగిలిన అన్నం ఉదయం తినడం చాలా కష్టం. ఇక దానిని పారేయడానికి కూడా ఎవరికీ మనసు రాదు. దీంతో చాలా ఇబ్బంది పడుతుంటారు. కానీ రాత్రి సమయంలో మిగిలిపోయిన అన్నంతో కూడా చాలా సింపుల్‌గా టేస్టీ టేస్టీ చపాతీ రెడీ చేసుకోవచ్చునంట. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5
రోజువారీ జీవితంలో త్వరగా, సులువుగా చేసుకోగలిగే అల్పాహారం ఎంతో అవసరం. ముఖ్యంగా రాత్రి మిగిలిన అన్నాన్ని ఎలా ఉపయోగించాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారి కోసమే ఈ అద్భుతమైన రిసిపీ. నూనె, నీళ్లు అస్సలు వాడకుండా, కేవలం కొన్ని పదార్థాలతోనే అద్భుతమైన రొట్టెలను, వాటికి తగ్గ కమ్మని చట్నీ తయారు చేసుకోవచ్చునంట. అది ఎలా అనుకుంటున్నారా?

2 / 5
 మిగిలిపోయిన అన్నంతో చపాతీ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. రాత్రి మిగిలిన అన్నం: 1 కప్పు, బియ్యప్పిండి: 1 కప్పు,  పచ్చిమిర్చి: 2 లేదా మూడు. చిటికెడు ఉప్పు.

3 / 5
 ముందుగా, రాత్రి మిగిలిన ఒక కప్పు అన్నాన్ని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఇందులోకి రెండు పచ్చి మిర్చిని కలపాలి. కొంచెం కూడా నీళ్లు పోయకుండా, అన్నాన్ని పచ్చిమిర్చిని మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి. మీకు పచ్చిమిర్చి ఇష్టం లేకపోతే, ఒక టీస్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఈ అన్నం పేస్ట్‌ను ఒక గిన్నెలోకి తీసుకొని, ఒక కప్పు బియ్యప్పిండిని కలపాలి. నీళ్లు అస్సలు పోయకుండా, చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. అన్నంలో ఉన్న తేమతోనే పిండి కలుస్తుంది. పిండిని బాగా కలిపిన తర్వాత, మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ సమయం పిండిని బాగా సెట్ చేస్తుంది.

4 / 5
10 నిమిషాల తర్వాత, పిండిని మరోసారి కలుపుకొని, రెండు సమాన భాగాలుగా విభజించుకోవాలి. కొద్దిగా గోధుమ పిండి లేదా బియ్యప్పిండి చల్లుకుంటూ, ఒక్కో భాగాన్ని పెద్ద చపాతీలా, సమంగా రుద్దుకోవాలి. ఒక గిన్నె లేదా మూత సహాయంతో గుండ్రని ఆకారంలో కట్ చేసుకోవాలి. ఇది రొట్టెలకు మంచి రూపాన్ని ఇస్తుంది. స్టవ్‌పై పెనం పెట్టి వేడి చేయాలి. పెనం వేడయ్యాక, మధ్యస్థ మంట మీద ఒక్కో రొట్టెను వేసి కాల్చుకోవాలి.

5 / 5
నూనె లేదా నెయ్యి అస్సలు వేయకుండా కాల్చవచ్చు. రెండు వైపులా తిప్పుకుంటూ, గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేవరకూ కాల్చుకోవాలి. మధ్యస్థ మంట మీద కాల్చడం వల్ల రొట్టెలు మృదువుగా వస్తాయి, అదే తక్కువ మంట మీద కాల్చితే గట్టిపడతాయి. ఆలస్యంగా లేచినప్పుడు లేదా అన్నం మిగిలిపోయినప్పుడు ఇది ఒక అద్భుతమైన పరిష్కారం.

Loading...
Unable to load recommendations.
Follow Us