
వానలు రెండు రోజుల నుంచి ఎక్కువగా పడుతున్నాయి . ఈ సమయంలో కొందరికి జలుబు, దగ్గు లాంటి సమస్యలు వస్తాయి. ఇక అలాంటి టైం లో ఈ మిరియాల అన్నం తింటే, ఆ సమస్యలనుంచి ఉపశమనం పొందొచ్చు. మరి, ఇంక లేట్ చేయకుండా దీనికి కావల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

కావలసిన పదార్థాలు: రెండు కప్పులఉడికించిన అన్నం, ఒక టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 6 వెల్లుల్లి రెబ్బలు 6, మూడు ఎండుమిర్చి, నాలుగు కరివేపాకు ఆకులు, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు , ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఇంగువ చిటికెడు, రెండు టేబుల్ స్పూన్ నెయ్యి, రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీరను కూడా వేసుకోవాలి.

మిరియాల అన్నం తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఆ తర్వాత గిన్నెలో కప్పు బియ్యం కొద్దిగా నీళ్లు పోసిబాగా ఉడికించాలి. అన్నం పొడిగా ఉన్నప్పుడే దించుకోవాలి. ఇంకో వైపు పాన్ పెట్టి నూనె వేసి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. ఆ తర్వాత దీనిలో మిరియాలు, నాలుగు ఎండుమిర్చి కూడా వేసి డీప్ ఫ్రై చేయాలి.

మిరియాల అన్నం తయారీ విధానం స్టెప్ 1: ఇంకా దీనిలో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని తీసుకుని మిక్సీజార్లో వేసి కచ్చాపచ్చాగా పొడి లాగా చేసుకోవాలి. ఇంకోవైపు పాన్లో నూనె పోసి ఆయిల్ వేడయ్యాక వెల్లుల్లిరెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. ఇంకా దీనిలో ఇందులో ఇంగువ కూడా వేయాలి.

మిరియాల అన్నం తయారీ విధానం స్టెప్ 2 : ఇక ఆ తర్వాత దీనిలో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించాలి. జీడిపప్పులు, టమోటాలు వేసి మెత్తబడే వరకు ఉంచుకోవాలి. అర టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు కూడా వేయాలి. చీప్ చివర్లో అన్నంతో పాటు, మిరియాల పొడి వేసి కలిపి దించేయాలి.