
ఎండు మిర్చి కారంపొడికి కావలసిన పదార్థాలు: 250 గ్రాములు ఎండు మిర్చి, పావు కప్పు శనగపప్పు , రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, మూడు టేబుల్ స్పూన్స్ మిరియాలు, 10 వెల్లుల్లి రెబ్బలు , ఒక టేబుల్ స్పూన్ కరివేపాకు ఆకులు, నిమ్మకాయ సైజంత చింతపండు , రుచికి సరిపడా ఉప్పును తీసుకోవాలి.

ఎండు మిర్చి పొడి తయారి విధానం: ముందుగా ఒక కళాయి తీసుకున దానిలో కొద్దిగా ధనియాలు వేసి మీడియం మంటపై వేయించాలి. ఇంకా ఎండు మిర్చిని కూడా వేయించి వాటిని ఫ్యాన్ చల్లారనివ్వాలి. మళ్లీ అదే పాన్ లో కొద్దిగా జీలకర్ర, మినప్పప్పు కూడా వేసి బంగారు కలర్లోకి వచ్చే వరకు వీటిని బాగా వేయించాలి.

వీటిని 5 నిముషాలు కంటే ఎక్కువగా వేయించాకూడదు. ఎందుకంటే, ఇది చేదు వస్తుంది కాబట్టి. ఇలా చేదుగా ఉంటే దీనిని అస్సలు తినలేము. ఇంకా నాలుగు కరివేపాకులను కూడా వేసి తడి పోయాక దీనిని బాగా వేయించాలి. ఇంకా వెల్లుల్లిని మీరు వేయించుకుని తీసుకుంటే ఈ పొడి నిల్వ ఎక్కువ కాలం ఉంటుంది. అయితే, దీనిలో అస్సలు పల్లీలు వేయకండి.

ఇప్పుడు మొత్తం చల్లారిన తర్వాత మిక్సీలో నాలుగు మిర్చి, ఇంకా నాలుగు మిరియాలు, ధనియాలు, కొద్దిగా జీలకర్ర కూడా వేసి దీనిని దంచుకోవాలి. ఇంకా ఆ తరువాత ఒక టేబుల్ స్పూన్ కరిపివేపాకు పొడి, వెల్లుల్లి, అలాగే, చింతపండు, రుచికి తగినంత ఉప్పు కూడా వేసి మెత్తగా రోటిలో దంచుకోవడమే.

పాత కాలంలో ఈ పొడిని ఎక్కువగా తినేవాళ్లు. అప్పట్లో ఎలాంటి వైద్యాలు కూడా లేవు. వేడి వేడి అన్నంలో ఒక టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకుని తింటే ఒంటి నొప్పులలు చిటికెలో తగ్గేది. ఇంకా ఇది ఏడాది పాటు నిల్వ ఉంటుంది. అన్నంలోకి మాత్రమే కాకుండా ఇడ్లీ, దోశలకు కూడా పర్ఫెక్ట్ టిఫిన్. మీరు కూడా ఇంట్లో పక్కా ట్రై చేయండి.