
కావలసిన పదార్థాలు & కొలతలు: అర కిలో ముడి పెసలు, అర కిలో పచ్చి శనగపప్పు, పావు కిలో ఎర్ర కందిపప్పు, 250 గ్రాముల బియ్యం, 100 గ్రాముల మెంతులు, 50 గ్రాముల వేపాకు , 50 గ్రాముల వేపాకు, 5 కప్పుల ఎండబెట్టిన నాటు గులాబీ రేకులు, 50 గ్రాముల ఎండబెట్టిన ఉసిరికాయ ముక్కల, కట్ చేసిన 20 గ్రాములు వట్టివేర్లు, 25 గ్రాముల బావంచాలు, 50 గ్రాముల గంధ కచోరాలు, 50 గ్రాముల తుంగగడ్డలు, 100 గ్రాముల కస్తూరి పసుపు కొమ్ములు, 2 కప్పుల ముల్తానీ మట్టి, గమనిక: ఎండబెట్టిన నిమ్మతొక్కలు, తులసి ఆకులు అందుబాటులో ఉంటే చేర్చుకోవచ్చు.

తయారీ విధానం: ఎండలు ఉన్నట్లయితే ఈ దినుసులన్నింటినీ ఒక రోజంతా ఎండలో ఉంచాలి; ఎండ లేని సమయంలో స్టవ్‌పై పాన్ పెట్టి పప్పులను పెసలు, శనగపప్పు, మసూర్ దాల్, బియ్యం, మెంతులు లో ఫ్లేమ్‌పై 5 నిమిషాల పాటు లైట్‌గా వేడిచేసి బేసిన్‌లోకి తీసుకోవాలి. క్రిస్పీగా వేయించకూడదు, కేవలం తడి ఆరి పురుగు పట్టకుండా ఉండటానికి మాత్రమే వేడిచేయాలి. అదే పాన్‌లో పచ్చి వేపాకును చేత్తో నలిపితే పొడయ్యేలా డ్రై హీట్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడి పాన్‌లోనే ఎండిన నాటు గులాబీ రేకులను ఒక్కసారి అటు ఇటు తిప్పి తీసేయాలి.

ఒక పెద్ద బేసిన్‌లో వేడిచేసిన పప్పులతో పాటు ఉసిరి ముక్కలు, ముక్కలుగా కత్తిరించిన వట్టివేర్లు, బావంచాలు, సుగంధ సువాసననిచ్చే గంధ కచోరాలు, తుంగగడ్డలు మరియు కస్తూరి పసుపు కొమ్ములను వేసి బాగా కలిపి ఫ్యాన్ కింద పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన మిశ్రమాన్ని కొద్దికొద్దిగా మిక్సీ జార్‌లో వేస్తూ మెత్తటి పౌడర్‌లా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ పరిమాణంలో ఉంటే మిల్లులో ఆడించుకోవచ్చు.

పిండి జల్లెడతో శనగపిండిలా నునుపుగా ఉండేలా జల్లించాలి; జల్లించగా మిగిలిన బరక రవ్వను తిరిగి మిక్సీ జార్‌లో మరికొన్ని పప్పులతో కలిపి మళ్లీ మెత్తగా పౌడర్ చేయాలి. జల్లించిన సున్నిపిండిలో 2 కప్పుల ముల్తానీ మట్టి వేసి పిండి మొత్తానికి సమానంగా కలిసేలా చేత్తో మిక్స్ చేయాలి. ముల్తానీ మట్టి చర్మంలోని నూనె గ్రంథులను సమతుల్యం చేసి, బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్ రాకుండా కాపాడుతుంది.

ఈ సున్నిపిండిని గాలి చొరబడని డబ్బాలో ఉంచి ఫ్రిడ్జ్‌లో భద్రపరుచుకుంటే సువాసన తగ్గకుండా ఎన్నాళ్లయినా తాజాగా ఉంటుంది; నెల నెలా వాడుకోవడానికి కొద్దిగా విడిగా తీసుకుంటే సరిపోతుంది. రోజూ స్నానానికి దీనిని ఉపయోగిస్తే చర్మం మల్లెపూవులా మెత్తబడి సహజమైన నిగారింపును సంతరించుకుంటుంది! (గమనిక: 6 సంవత్సరాల పైబడిన పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా నిరభ్యంతరంగా వాడుకోవచ్చు.