తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సహా వివిధ ప్రాంతాల్లో టమాట ధరలో పెరుగుదల మొదలైంది. గత వారం రోజుల్లోనే ధర 100 శాతం పెరిగింది. దీని వల్ల సామాన్య ప్రజల బడ్జెట్ పై తీవ్ర ప్రభావం పడింది. అయితే ఇదే సమయంలో టమాట సాగు చేస్తున్న రైతులు సంతోష పడుతున్నారు. టమాటా ధర ఇదే విధంగా పెరిగితే ఇప్పటి వరకూ వచ్చిన నష్టాన్ని కొంతమేర పూడ్చుకోవచ్చని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
గత నెలలో టమోటా రైతులు ధర పడిపోవడంతో రోడ్డుమీద పోసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మండీల్లోని వ్యాపారులు రైతుల నుంచి కిలో రూ.2 నుంచి రూ.3 చొప్పున టమాట కొనుగోలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే రైతు పండించిన టమాటాకి మంచి రేటు వస్తోంది.
తెలంగాణాలో బహిరంగ మార్కెట్ లో టమాటా రిటైల్ రేటు కిలో రూ.30 నుండి రూ.50 నుండి రూ.60కి పెరిగింది. హైదరాబాద్ సహా అనేక నగరాల్లో, రిటైల్ మార్కెట్‌లో టమోటాలు కిలో రూ. 50 నుండి 60 వరకు విక్రయిస్తున్నారు. అదే సమయంలో రాక తగ్గడంతో టమోటా రేటు పెరిగిందని రైతులు చెబుతున్నారు.
కొన్ని నెలల క్రితం టమాటా డిమాండ్ కంటే ఎక్కువగా ఉత్పత్తి అయ్యేది. అందుకే టమోటాలు చాలా చౌక అయ్యాయి. ఇప్పుడు అకాల వర్షాలతో టమాటా దిగుబడి తగ్గడంతో మార్కెట్ లో టమాటా రాక తగ్గింది. దీంతో టమాటా ధరకు రెక్కలు వచ్చాయి.. మరికొన్ని రోజుల్లో టమాటా ధర మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
ముఖ్యంగా గత కొంతకాలంగా కురిసిన అకాల వర్షాలు, వడగళ్ల వాన కారణంగా దాదాపు 50 శాతం టమోటా పంట నాశనమైంది. దీంతో ఒక్కసారిగా మార్కెట్‌కు టమాటా రాక తగ్గి ధరలు పెరగడం మొదలైంది. ప్రస్తుతం వ్యాపారులు టమాటను కిలో రూ.16 నుంచి 22 వరకు పెద్దమొత్తంలో కొనుగోలు చేస్తున్నారు. రిటైల్ రేటు కిలో రూ.60కి చేరుకోవడానికి ఇదే ప్రధాన కారణం.
గత కొంత కాలం క్రితం వరకూ కిలో టమాటా ధర రూ.10 నుంచి 20 వరకు ఉండేది. అయితే రెండు నెలల్లోనే టొమాటో ధర చాలా రెట్లు పెరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో మాత్రమే టమోటా ధరకు రెక్కలు రాలేదు.. దేశ రాజధాని ఢిల్లీతో సహా అనేక ప్రాంతాల్లో టమాటా ధరలు పెరిగాయి. వారం రోజుల క్రితం కిలో రూ.15 నుంచి 20 వరకు విక్రయించే చోట ప్రస్తుతం టమాట ప్రస్తుతం కిలో రూ.30 నుంచి రూ. 50 లకు చేరుకుంది