
కూరగాయలను అన్నంలో ఉడికించుకోవాలి: నాలుగు టమాటాలు, మూడు పచ్చిమిర్చి, ఒక పెద్ద మామిడికాయను అన్నం రైస్ లో బాగా ఉడికించుకోవాలి. ఇంకా వీటిని మీడియం మంటపై మెత్తగా అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా చేస్తే ముక్కల లోపల కూడా ఉడుకుతుంది. కాబట్టి, మీరు కూడా కచ్చితంగా ఇలా చేసుకోండి.

ముందుగా పచ్చి మామిడిని బాగా కడిగి, కుదిరితే తొక్క కూడా తీసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉడికే అన్నం పాత్రలో వేయాలి. అలాగే, వీటితో పాటు మూడు టమాటాలు, నాలుగు పచ్చి మిర్చి కూడా దీనిలో వేసుకోవాలి. అన్నంతో పాటు ఇవి కూడా మంచిగా ఉడుకుతాయి.

ఇవి బాగా ఉడికిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకుని ముందుగా మామిడి ముక్కలను మెత్తగా చేసి, ఆ తరవాత టామాటాలను తీసుకుని మెత్తగా చేసుకోవాలి. ఇక చివర్లో పచ్చి మిర్చిని కూడా మెత్తగా చేసుకోవాలి. ఇలా చేసి తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. అలాగే, నోటికి మంచి కూడా తగులుతుంది.

ఇంకా మీకు రుచి కావాలంటే దీనిలో ఉల్లి పాయ ముక్కలను కూడా దీనిలో వేసుకోవాలి. అలాగే, దీనిలో ఇంకా వెల్లుల్లి, ఉప్పు కూడా వేస్తే టేస్టీగా ఉంటుంది. నూనె వాడకుండా ఇలా ఈజీగా చేతితోనే పచ్చడి చేసి తినొచ్చు.

అయితే, ఈ పచ్చడి చేసుకున్న తరవాత వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే ఈ టమాటా,మామిడి చేతి పచ్చడి ఎంతో టేస్టీగా ఉంటుంది. అంతేకాదు రుచి డబుల్ అవుతుంది. పచ్చి మామిడిలో పులుపు, టమాటా రుచి కూడా దీనిలో కలిసిపోయి రుచిని మరింత పెంచుతాయి.