ముఖేష్ అంబానీతో పెళ్లికి నీతా పెట్టిన కండీషన్ ఏంటో తెలుసా.?

|

Mar 28, 2024 | 3:47 PM

దేశంలోనే సంపన్న వ్యక్తి ముఖేష్‌ అంబానీ భార్య నీతా ఒకప్పుడు సామాన్య కుటుంబానికి చెందిన వ్యక్తి అని తెలుసా? అవును ఆమె ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. వివాహానికి ముందు నీతా పేరు నీతా దలాల్‌. ఒక స్కూల్లో టీచర్‌గా పనిచేసేవారు. నీతాకు భరతనాట్యం అంటే ఇష్టం.. ఇంకా మరిన్ని వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందామా..

1 / 5
 దేశంలోనే సంపన్న వ్యక్తి ముఖేష్‌ అంబానీ భార్య నీతా ఒకప్పుడు సామాన్య కుటుంబానికి చెందిన వ్యక్తి అని తెలుసా? అవును ఆమె ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. వివాహానికి ముందు నీతా పేరు నీతా దలాల్‌.  ఒక స్కూల్లో టీచర్‌గా పనిచేసేవారు. నీతాకు భరతనాట్యం అంటే ఎంతో ఇష్టం. ఆమె దానిలో ఎంతో ప్రావీణ్యం సంపాదించారు. పిల్లలకు పాఠాలు చెప్పడం అంటే కూడా ఆమెకు చాలా ఇష్టం.

2 / 5
అలాంటి నీతాను ముఖేష్‌ అంబానీ తల్లి కోకిలాబెన్‌ ఓ కల్చరల్‌ ప్రోగ్రామ్‌లో ఆమె నాట్యం చూసి ముగ్ధురాలై నీతాను తన ఇంటి కోడలిని చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. వెంటనే ధీరూబాయ్‌ అంబానీకి విషయం చెప్పగానే ఆయన నీతా తండ్రికి ఫోన్‌ చేసి పెళ్లి ప్రస్తావన తెచ్చారు. దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త కుటుంబంతో తన కుమార్తె పెళ్లి ప్రతిపాదన రావడంతో నీతా తండ్రి షాక్ అయ్యారు . ఈ ప్రతిపాదనకు నీతా కూడా అవాక్కయ్యారు. ఒకింత సంశయించారు కూడా. పై నీతా మొదట్లో సంశయించారు.

3 / 5
తర్వాత ఆమె ముఖేష్ అంబానీతో  పెళ్లి ప్రతిపాదనను అంగీకరించారు. పెళ్లికి అంగీకరించే ముందు నీతా ముఖేష్ అంబానీకి ఓ షరతు పెట్టారట. ఆ షరతుకు ముఖేష్ అంబానీ కూడా అంగీకరించడంతో నీతా-ముఖేష్‌  పెళ్లి పెద్దల ఆశీర్వాదంతో జరిగిపోయింది. దాంతో నీతా దలాల్‌ కాస్తా నీతా అంబానీగా మారారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈ పరిస్థితి గురించి నీతా స్వయంగా తెలియజేశారు.

4 / 5
ఇంతనీ నీతా అంబానీ ముఖేష్‌ అంబానీకి పెట్టిన షరతు ఏంటో తెలుసా? పెళ్లయ్యాక కూడా తను టీచర్‌గా పనిచేయాలనుకుంటున్నట్లు ముఖేష్‌కి నీతా చెప్పారట. అందుకు ముఖేష్ అంగీకరించడంతో నీతా పెళ్లి చేసుకున్నారట. అయితే పెళ్లి తర్వాత నీతా టీచర్‌గా ఎక్కువ కాలం పని చేయలేదు. దాంతో నీతా అంబానీ ముంబైలో ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌ను స్థాపించారు.

5 / 5
షారూఖ్-సచిన్‌ల పిల్లలు ఆ స్కూల్‌లోనే చదువుకున్నారు. కానీ పెళ్లయ్యాక నెలకు 800 రూపాయల జీతంతో టీచర్ ఉద్యోగంలో చేరినప్పుడు అందరూ నవ్వారని తెలిపారు.  అయితే ఇప్పుడు ఆమె దేశంలోనే అత్యంత సంపన్న వ్యక్తి భార్య... 800 రూపాయలకు టీచర్‌గా పనిచేయాలనుకున్న నీతా ఇప్పడు తనలాంటి ఎందరో టీచర్లకు జీతాలిస్తున్నారు.