
Owl- గుడ్లగూబ.. లక్ష్మీ దేవి వాహనం అని చాలా మందికి తెలుసు. దీపావళి రోజున గుడ్లగూబను చూడటం వారికి, ఆ ఇంటికి ఎంతో శ్రేయస్కరంగా నమ్ముతారు.. మీరు దీపావళి రోజున గుడ్లగూబను చూస్తే, సంపదలకు దేవత అయిన లక్ష్మీ దేవి మిమ్మల్ని కరుణించబోతుందని అర్థం చేసుకోండి.

Cow- ఆవు.. హిందూ మతంలో ఆవును కూడా చాలా పవిత్రంగా భావిస్తారు. గోవుకు తల్లి హోదా కల్పించారు. దీపావళి రోజున ఆవు మీ ఇంటికి వస్తే శుభప్రదం. మీ జీవితంలో కొన్ని సానుకూల మార్పులు సంభవించవచ్చని ఇది సూచిస్తుంది.

Cat- పిల్లి కనిపించడం, మీ దారికి అడ్డుగా రావడం అశుభంగా భావించినప్పటికీ, దీపావళి రోజున పిల్లిని చూడటం శుభసూచకాలను ఇస్తుంది. ఈ రోజు మీరు పిల్లిని చూస్తే, మీరు లక్ష్మీ దేవి ఆశీర్వాదం పొందబోతున్నారని అర్థం చేసుకోండి.

Elephant- ఏనుగు శ్రేయస్సు, పదునైన తెలివితేటలకు చిహ్నంగా పరిగణిస్తారు. దీపావళి రోజున మీరు ఏనుగును చూస్తే, అది మీ జీవితంలో మంచి మార్పులకు సంకేతం.

దీపావళి పండుగ సమయంలో చిట్టెలుక కనిపించడం కూడా చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. ఇది మీ ఆదాయంలో పెరుగుదలను సూచిస్తుంది. దీపావళి రోజు రాత్రి ఎలుక కనిపిస్తే సంతోషించాల్సిందే. శకున్ శాస్త్రం ప్రకారం, ఎలుక దర్శనం డబ్బు రాకకు సూచిక. దీపావళి రోజు ఎలుక కనిపిస్తే తరిమికొట్టకూడదు. Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)