Health Tips: ఈ 5 ఆహారాలతో జాగ్రత్త.. తింటే ప్రమాదమే.. అవేంటో తెలుసా!

|

Mar 02, 2022 | 9:42 AM

మనం తీసుకునే పోషకాహారం.. మనల్ని ఆరోగ్యకరంగా ఉంచడమే కాదు.. మానసికంగా ఆహ్లాదకరంగా ఉండేలా చేస్తుంది...

1 / 6
మనం తీసుకునే పోషకాహారం.. మనల్ని ఆరోగ్యకరంగా ఉంచడమే కాదు.. మానసికంగా ఆహ్లాదకరంగా ఉండేలా చేస్తుంది. ఇది వినడానికి కొంచెం వింతగా ఉన్నా.. పలు పరిశోధనలలో ఇది నిజమని తేలింది. ఇదిలా ఉంటే.. కొన్ని ఆహారాలు మన కడుపుకే కాదు.. మెదడుకు కూడా హాని చేస్తాయి. అవేంటో తెలుసుకుందాం పదండి..

2 / 6
జంక్ ఫుడ్: ఈ జంక్ ఫుడ్స్‌లో రిఫైన్డ్ షుగర్, ఫ్యాట్ ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల వీటి ప్రభావం కడుపుపై మాత్రమే కాదు.. మెదడుపై కూడా పడుతుంది. నిరంతరం జంక్ ఫుడ్ తింటుంటే.. మనల్ని ఎన్నో రకాల వ్యాధులు చుట్టుముడతాయి.

3 / 6
కెఫిన్: టీ లేదా కాఫీ తాగకుండా ఎవ్వరికీ రోజు పూర్తి కాదు. అయితే వీటిలో ఉండే కెఫిన్ అసిడిటీ లేదా గ్యాస్ సమస్యలను సృష్టిస్తుంది. నిద్రలేమికి కూడా కారణం కావచ్చు. ప్రతీ రోజూ మోతాదుకు మించి కెఫిన్ తీసుకోకపోవడమే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.

4 / 6
స్వీట్లు: సాధారణంగా అందరికీ స్వీట్లంటే ఇష్టం ఉంటుంది. అయితే చక్కెర శాతం ఎక్కువ ఉండే స్వీట్లు మోతాదుకు మించి తిన్నట్లయితే.. మన శరీరానికే కాదు.. మనసుకు మంచిది కాదని వైద్యుల సలహా.

5 / 6
ఉప్పు: ఎక్కువ మోతాదులో ఉప్పు తీసుకోవడం వల్ల రక్తం నాణ్యత దెబ్బతింటుంది. అంతేకాదు బ్లడ్ ప్రెజర్ లాంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే మీరు తీసుకునే ఆహారాల్లో ఉప్పు మోతాదుకు మించి ఉండకూడదు.

6 / 6
ఆల్కహాల్: ఆల్కహాల్ సేవించడం ఆరోగ్యానికి మాత్రమే కాదు మానసిక ఆరోగ్యానికి మంచిది కాదు. ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వల్ల తరచూ ఒత్తిడికి లోనవుతారు.