
జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి ఉన్న ప్రత్యేకత గురించి ఎంత చెప్పినా తక్కువే. వాస్తు నియమాలు సరిగా పాటించినప్పుడు మాత్రమే జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. ఇక మరీ ముఖ్యంగా శ్రావణ మాసంలో వాస్తు నియమాలు అనేవి తప్పకుండా పాటించాలి. లేకపోతే శివుడు ఆగ్రహానికి గురి అవుతాడంటారు. దీంతో జీవితంలో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందంట. కాగా, అసలు శ్రావణ మాసంలో పాటించాల్సిన వాస్తు టిప్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రావణ మాసంలో శివుడిని పూజించే సమయంలో ఎట్టిపరిస్థితుల్లో విరిగిన శివలింగం లేదా, చిరిగి ఉన్న శివుడి చిత్రాన్ని పూజించకూడదంట. శివలింగం విరిగిపోయినట్లు ఉన్నా లేదా చిత్ర చిరిగిపోయినా, అది శివుడికి ఆగ్రహం తెప్పిస్తుందంట. అలాగే వాస్తు శాస్త్ర ప్రకారం ఇలా పూజ చేయడం వలన అశుభ ఫలితాలు కలగడమే కాకుండా, ఇంట్లో సమస్యలు ఎక్కువ అవుతాయంట.

వాస్తు శాస్త్రం ప్రకారం శ్రావణ మాసంలో మీ ఇంటిలో ఉత్తర దిశను చాలా శుభ్రంగా ఉంచాలంట. ఎందుకంటే ఉత్తర దిశను కుబేరుడి దిశగా, శివుడితో సంబంధమైన దిశగా భావిస్తారు. అందువలన ఆ దిశలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెత్త, బరువైన వస్తువుల, టాయిలెట్స్ లాంటివి ఉండకుండా చూసుకోవాలంట. ఆ ప్రదేశం చాలా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలంట.

శ్రావణ మాసంలో వంటగదిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు పండితులు. వాస్తు శాస్త్రం ప్రకారం వంటగది ప్రాముఖ్యత చాలా గొప్పది. అందువలన శ్రావణ మాసంలో వంటగదిలో చెల్లా చెదురు లేకుండా, ధూళి, చెత్త వంటివి లేకుండా చేయాలి. దీని వలన ఇంట్లో శాంతి, ఆనందం నెలకొంటుందంట.

అదే విధంగా శ్రావణ మాసంలో శివుడికి పూజ చేసేటప్పుడు తప్పకుండా నియమ నిబంధనలు పాటించాలి. ముఖ్యంగా రోజూ ఉదయం స్నానం ఆచరించిన తర్వాతనే శివుడిని పూజించాలంట. స్నానం చేయకుండా పూజించడం అస్సలే మంచిది కాదంట. వాస్తు శాస్త్ర ప్రకారం, స్నానం చేయకుండా శివయ్యను పూజించడం వలన అది అసంపూర్ణం అవుతుంది. దీని వలన పాపం చుట్టుకుంటుందంట.