
అచ్చం గుమ్మడికాయలా కనిపించే కూరగాయ స్క్వాష్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ ఏ, సి, బి వంటివి పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా మెగ్నీషియం, బీటా కెరోటన్, పాలీఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అందువలన వీటిని మీరు ప్రతి రోజూ తీసుకవడం వలన టైప్ 2డయాబెటిస్ నుంచి బయటపడటమే కాకుండా, ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను సమతుల్యంలో ఉంచుతుంది. క్యాన్సర్ కణాలను అడ్డుకుంటుంది. అంతే కాకుండా రోగనిరోధక శక్తి పెంచుతుంది.

అక్టోబర్ నెలల తప్పక తినాల్సిన కూరగాయల్లో క్యారట్ ఒకటి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమెంటరీ , ప్లాస్మా లిపిడ్, మాడిఫైయింగ్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందువలన ఇవి క్యాన్సర్ , గుండె సంబంధ సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. అలాగే ఇమ్యూనిటీ పెరిగేలా చేస్తుంది. అందుకే అక్టోబర్ నెలలో క్యారట్ తప్పకుండా తినాలంటున్నారు నిపుణులు.

క్యాబేజీ, ఇది ఆరోగ్యానికి మంచిది. ఇందులో ఇందులో విటమిన్లు సి , కె, ఫైబర్, ఆంథోసైనిన్లు , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అందువలన అక్టోబర్ నెలలో క్యాబేజీ తప్పకుండా తినాలంట. ఇది శరీరంలోని వాపును తగ్గించడంలో, రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇవ్వడంలో, అలాగే ఎముకల ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడతాయి. ఆకులలో కనిపించే ఫైబర్ కంటెంట్ గట్ బాక్టీరియాను పెంచి జీర్ణక్రియకు సహాయపడుతుంది.

కాలీ ఫ్లవర్ కర్రీ అంటే చాలా మంది ఇష్టపడరు. కానీ దీనిలో అనేక పోషకాలు ఉంటాయంట. ముఖ్యంగా కాలీఫ్లవర్ లో మిథనాలిక్ సారం, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వలన ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. అందుకే దీనిని తప్పకుండా అక్టోబర్ నెలలో తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.

క్యాబేజీ జాతికి చెందిన కూరగాయల్లో కాలే ఒకటి. ఇందులో విటమిన్లు ,ఫోలేట్ , కాల్షియం, పొటాషియం, మాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో కెరోటినాయిడ్లు, ఫ్లేవనాయిడ్లు, గ్లూకోసినోలేట్లు , పాలీఫెనాల్స్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి, ఇవి ఆక్సీకరణ ఒత్తిడి , వాపును ఎదుర్కోవడానికి సహాయపడతాయి. రోనిరోధక శక్తిని పెంచుతాయి.