పక్కా తెలంగాణ స్టైల్.. ఘాటుగా కారంగా మసాలా చికెన్ ఫ్రై.. ఎలా చేయాలంటే?

Updated on: Jul 10, 2026 | 4:45 AM

మసాలా చికెన్ ఫ్రై రిసిపీ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు. ప్రతి ఒక్కరూ ఇష్టంగా చికెన్ ఫ్రై తింటారు. అయితే ఇప్పుడు మనం పక్కా తెలంగాణ స్టైల్‌లో మసాలా చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ఈ విధానంలో చేస్తే ఎవరూ ముక్క కూడా వదలకుండా ఇష్టంగా తింటారంట.

1 / 5
కావాల్సిన పదార్థాలు : చికెన్ , పెరుగు ,అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 స్పూన్లు, కారం - 2 స్పూన్లు,పసుపు - 1/2 స్పూన్ ధనియాల పొడి - 1 స్పూన్ జీలకర్ర పొడి - 1/2 స్పూన్, గరం మసాలా - 1/2 స్పూన్, ఉప్పు - రుచికి సరిపడ, నిమ్మరసం - 1 స్పూన్ ఫ్రై చేయడానికి,ఉల్లిపాయలు - 2 పెద్దవి,  పచ్చిమిర్చి - 3,కరివేపాకు - 2 రెమ్మలు, కొత్తిమీర.

2 / 5
తయారీ విధానంలోకి వెళితే..ముందుగా చికెన్ తీసుకోవాలి. శుభ్రంగా కడగాలి. తర్వాత దీనిని వేరే బౌల్‌లోకి తీసుకోవాలి. అందులో కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి,జీలకర్ర, గరం మాసాలా, ఉప్పు, నిమ్మరసం, కొంచె నూనె,  అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ పేస్ట్, పచ్చి మర్చీ, కరివేపాకు, కొత్తిమీర, అన్నీ వేసి  మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. దీనిని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.

3 / 5
ఇప్పుడు స్టవ్ ఆన్ చేయాలి.  అందులో నూనె వేసి బాగా వేడి చేయాలి. నూనె మంచిగా వేడి అయిన తర్వాత అందులో  మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి, మంచిగా ఉడికి, బాగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి.  ముక్కలు గోల్డ్ కలర్‌ల వచ్చే వరకు చికెన్ వేయించుకుంటూనే ఉండాలి. అప్పుడే వాటి రుంచి అద్భుతంగా ఉంటుంది.

4 / 5
ఇప్పుడు  చికెన్ ముక్కలు బంగారు రంగులోకి వచ్చిన తర్వాత వేరే ప్లేట్‌లోకి తీసుకోవాలి. మళ్లీ అదే నూనెలో ఆవాలు , కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చీ వేసి పోపు విధంగా వేయించుకోవాలి. తర్వాత అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి, మంచిగా కలుపుతూ ఉండాలి.

5 / 5
అవి బాగా కలిపి, పోపు అనేది ముక్కలకు బాగా పట్టిన తర్వాత  కొంచెం గరం మసాలా,  టీ స్పూన్ ధనియాల పొడి వేసి మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ముక్కలకు మసాలా బాగా పట్టాలి. అంత వరకు కలుపుతూ ఉండాలి. ఇక మసాలా, ఉప్పు అన్నీ వేసి బాగా కలిపిన తర్వాత, కొంచె కొత్తి మీర వేయాలి. అంతే టేస్టీ టేస్టీ మసాలా చికెన్ ఫ్రై రెడీ.

Follow Us