Youtube: యూట్యూబ్‌లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఈ ఫీచర్ ఉపయోగం ఏంటో తెలుసా?

|

Nov 09, 2023 | 9:59 PM

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ యూట్యూబ్‌కు ఎలాంటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్‌ను కోట్లాది మంది ఉపయోగిస్తున్నారు. ఓటీటీల హవా ఓ రేంజ్‌లో నడుస్తున్న ఈ రోజుల్లోనూ యూట్యూబ్‌కు ఏమాత్రం ఆదరణ తగ్గకపోవడానికి ఇందులోని ఫీచర్సే కారణమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తోంది యూట్యూబ్‌..

1 / 5
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌.. ఇప్పుడీ పేరు ప్రపంచాన్ని శాసిస్తోంది. అన్ని రంగాల్లో ఏఐ వినియోగం అనివార్యంగా మారింది. మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా ఏఐ సాంకేతికత టెక్నాలజీ రంగంలో కొత్త పుంతలు తొక్కిస్తోంది.

2 / 5
యూజర్ల అవసరాలకు, అభిరుచులకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ వినియోగిస్తూ టెక్‌ సంస్థలు సైతం కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ యూట్యూబ్‌ సైతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్‌ను ప్రవేశపెట్టింది.

3 / 5
తమ యూజర్లకు మరింత బెస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించే క్రమంలో యూట్యూబ్‌లో ఏఐ ఆధారిత కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇంతకీ ఈ ఫీచర్‌ ఏంటి.? దాంతో కలిగే ప్రయోజనం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

4 / 5
యూట్యూబ్‌ తీసుకొస్తున్న ఈ కొత్త ఫీచర్‌ సహాయంతో వీడియోలకు సంబంధించి ఏవైనా ప్రశ్నలు, కంటెంట్ కోసం సిఫార్సులు వంటి వాటికి సమాధానాలు ఇవొచ్చు. వీడియో కింద కనిపించే 'ఆస్క్‌' అనే ఆప్షన్‌ ద్వారా వీడియోకు సంబంధించి ప్రశ్నలు అడగడం లేదా ఇతర వివరాలు తెలుసుకోవచ్చు.

5 / 5
ఈ ప్రశ్నలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ద్వారా సమాధానాలు ఇస్తారు. ఈ ఫీచర్‌ను ఇప్పటికే ఎంపిక చేసిన కొందరు యూజర్లకు అందిస్తుండా, త్వరలోనే యూట్యూబ్‌ ప్రీమియం మెంబర్స్‌కి అందుబాటులోకి తీసుకురానున్నారు.