
హెచ్‌పీ 15ఎస్ 12 జెనరేషన్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్‌తో వస్తుంది. 15.6 అంగుళాల డిస్‌ప్లేతో వచ్చే ఈ ల్యాప్‌టాప్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగులకు అనువుగా ఉంటుంది. విండోస్ 11కు సపోర్ట్ చేసే ఈ ల్యాప్‌టాప్ వైఫై, బ్లూటూత్, యూఎస్‌బీతో వస్తుంది. ముఖ్యంగా వీడియో కాల్‌లకు అనువైన ట్రూ విజన్ 720పీ హెచ్‌డీ కెమెరాతో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ ధర: రూ. 47,800గా ఉంది.

హెచ్‌పీ 15ఎస్ రైజన్ 5500యూ ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ ల్యాప్ టాప్ స్ట్రీమింగ్, సర్ఫింగ్, మల్టీ టాస్కింగ్ కోసం సరిగ్గా సరిపోతుంది. 15.6 అంగుళాల డిస్ ప్లేతో వచ్చే ఈ ల్యాప్ టాప్ హెచ్‌డీ కెమెరా, డ్యూయల్ అర్రే మైక్‌లు, డ్యూయల్ స్పీకర్‌లతో వస్తుంది. ఏఎండీ రేడియన్ గ్రాఫిక్ కార్డుతో వచ్చే ఈ ల్యాప్ టాప్ ఆకర్షణీయమైన కంప్యూటింగ్ అనుభవాన్ని అందిస్తుంది. 16 జీబీ ర్యామ్‌తో వచ్చే ఈ ల్యాప్ టాప్ యూఎస్‌బీ పోర్ట్‌లు, హెచ్‌డీఎంఐ పోర్ట్‌లు, వైఫై, బ్లూటూత్‌తో సహా వివిధ కనెక్టివిటీ ఎంపికలతో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ ధర రూ. 43,490గా ఉంది.

హెచ్‌పీ 15 ల్యాప్ టాప్ 13 జెనరేషన్, ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్‌తో వస్తుంది. మెరుగైన బ్యాటరీ లైఫ్‌తో వచ్చే ఈ ల్యాప్ టాప్ మైక్రో-ఎడ్జ్ డిస్‌ప్లేతో 15.6 అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. విండోస్ 11, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2021 పని చేసే ఈ ల్యాప్‌టాప్ యాంటీ-గ్లేర్ డిస్‌ప్లే ఆకట్టుకుంటుంది. ఈ ల్యాప్‌టాప్ ఎక్కువగా పని చేసే వారికి సరైన ఎంపికగా ఉంటుంది. 7 గంటల 45 నిమిషాల బ్యాటరీ లైఫ్‌ను అందించే ఈ ల్యాప్‌టాప్ ధర రూ. 40,990గా ఉంది.

హెచ్ పీ 15 12వ జెన్ ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్‌తో వచ్చే ఈ ల్యాప్ టాప్ 16 జీబీ ర్యామ్‌తో వస్తుంది. మెరగైన మల్టీ టాస్కింగ్‌తో వచ్చే ఈ ల్యాప్‌టాప్ 512 ఎస్ఎస్‌డీతో వస్తుంది. డ్యూయల్ ఫ్రంట్ ఫేసింగ్ స్పీకర్‌తో పాటు క్రిస్టల్-క్లియర్ ఆడియోను అందిస్తుంది. అల్ట్రా-లైట్ తేలికైన ల్యాప్‌టాప్. అందువల్ల ఈ ల్యాప్‌టాప్‌ను ఎక్కడికైనా సులభంగా తీసుకువెళ్లవచ్చు. మెరుగైన కంప్యూటింగ్ అనుభవాన్ని అందించే ఈ ల్యాప్‌టాప్ ధర రూ. 35,999గా ఉంది.

హెచ్ 15 ఎస్ 11వ జెనరేషన్ ల్యాప్‌టాప్ ఐ5 ప్రాసెసర్‌తో 15.6 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. మల్టీటచ్‌తో వచ్చే ఇమేజ్‌ప్యాడ్ ఈ ల్యాప్ టాప్ ప్రత్యేకత. యాంటీ-గ్లేర్ డిస్‌ప్లేతో యూఎస్‌బీ, హెచ్‌డీఎంఐ, ఏసీ స్మార్ట్ పిన్, హెడ్‌ఫోన్/మైక్రోఫోన్ పోర్ట్‌తో సహా బహుళ పోర్ట్ ఎంపికలతో వస్తుంది. అలాగే క్రిస్టల్-క్లియర్ ఆడియోను అందించే డ్యూయల్ ఫ్రంట్ ఫేసింగ్ స్పీకర్ కూడా ఉంది. ఈ ల్యాప్‌టాప్ ధర రూ. 41,499గా ఉంది.