
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ షావోమీ తాజాగా మరో కొత్త స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. Mi TV EA70 పేరుతో ప్రస్తుతం చైనాలో లాంచ్ అయిన ఈ టీవీ త్వరలోనే భారత్‌లో అందుబాటులోకి రానుంది.

70 ఇంచెస్‌తో కూడిన పెద్ద స్క్రీన్‌తో రూపొందించిన ఈ స్మార్ట్ టీవీ చైనాలోని షావోమీ ఆన్‌లైన్ స్టోర్‌లో ప్రీఆర్డర్లకు అందుబాటులోకి తీసుకొచ్చారు. డిసెంబర్ 31 నుంచి సేల్ ప్రారంభంకానుంది.

క్వాడ్-కోర్ ప్రాసెసర్తోపనిచేసే ఈ టీవీలో 176 డిగ్రీల వ్యూయింగ్యాంగిల్ను అందించారు. ఈ టీవీలో 1.5 జీబీ ర్యామ్, 8 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరోజ్‌ను అందించారు. స్మార్టర్వాయిస్ కంట్రోల్, మినిమలిస్ట్ మోడ్‌లు ఈ టీవీ ప్రత్యేకతలు.

బ్లూటూత్ వాయిస్ రిమోట్ కంట్రోల్, బ్లూటూత్ వైఫై, ఇన్ఫ్రారెడ్ వంటి కనెక్టివిటీ ఆప్షన్లను ఈ టీవీలో అదించారు.

ఇక సౌండ్ విషయానికొస్తే.. ఎమ్‌ఐ కొత్త టీవీలో రెండు 10 వాట్స్స్పీకర్లు, డీటీఎస్హెచ్డీ సపోర్ట్‌ను అందించారు.