Xiaomi Mix Fold 2: షావోమీ నుంచి మడతపెట్టే ఫోన్‌ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

|

Aug 14, 2022 | 6:18 PM

Xiaomi Mix Fold 2: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమీ తాజాగా కొత్త ఫోల్డబుల్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. షావోమీ మిక్స్‌ ఫోల్డ్‌ 2 పేరుతో లాంచ్‌ చేసిన ఈ స్మార్ట్‌ ఫోన్‌లో అధునాతన ఫీచర్లను అందించారు. ప్రస్తుతం చైనాలో లాంచ్‌ అయిన ఈ ఫోన్‌ త్వరలోనే భారత్‌లోకి రానుంది...

1 / 5
స్మార్ట్‌ఫోన్‌లు రోజుకో రూపం మార్చుకుంటూ సందడి చేస్తున్నాయి. ప్రస్తుతం ఫోల్డబుల్‌ (మడతపెట్టే) ఫోన్‌ల హవా నడుస్తోంది. ఇప్పటికే సామ్‌సంగ్‌ వంటి అగ్ర సంస్థలు ఇలాంటి ఫోన్‌లను లాంచ్‌ చేయగా.. తాజాగా చైనాకు చెందిన షావోమీ.. షావోమీ మిక్స్‌ ఫోల్డ్‌ 2 పేరుతో చైనాలో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది.

2 / 5
ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఫోల్డ్‌ చేసినప్పుడు కనిపించే బయట డిస్‌ప్లే 6.56 ఇంచెస్‌తో రూపొందించారు. ఇక లోపల ఉండే డిస్‌ప్లేను 8 ఇంచెస్‌తో ఇచ్చారు. రెండు డిస్‌ప్లేలూ 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌కి సపోర్ట్‌ చేస్తాయి.

3 / 5
క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8+ జెన్‌ 1 4ఎన్‌ఎమ్‌ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో గరిష్టంగా 12 జీబీ ర్యామ్‌, 1టీబీ వరకు స్టోరేజ్‌ను అందించారు.

4 / 5
షావోమీ మిక్స్‌ ఫోల్డ్‌ 2 స్మార్ట్‌ ఫోన్‌లో  67 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 4500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. కేవలం 40 నిమిషాల్లోనే 100 శాతం ఛార్జింగ్‌ పూర్తవుతుంది.

5 / 5
కెమెరా విషయానికొస్తే 50 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీల కోసం 20 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ 12 జీబీ ర్యామ్‌ + 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర ఇండియన్‌ కరెన్సీలో రూ. 1,06,400 కాగా, 12GB+512GB ధర రూ.1,18,300, 12GB RAM + 1TB ఇంటర్నల్ స్టోరేజ్‌ ధర రూ. 1,42,000 వరకు ఉండొచ్చు.