WhatsApp: వాట్సాప్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.. ఇకపై ఆ సమస్యకు చెక్‌

|

Jun 24, 2024 | 9:25 PM

వాట్సాప్‌.. స్మార్ట్‌ ఫోన్‌ ఉపయోగిస్తున్న వారికి ఈ యాప్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది ఉపయోగిస్తున్న ఏకైక మెసేజింగ్‌ యాప్‌ వాట్స్‌కు మాములు క్రేజ్‌ లేదు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తోంది కాబట్టే వాట్సాప్‌ యూజర్లు ఏమాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలోనే వాట్సాప్‌లో తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నారు..

1 / 5
ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. సాధారణంగా వాట్సాప్‌ ఉపయోగించే సమయంలో ఎవరికైనా ఫోన్‌ కాల్‌ చేయాలంటే యాప్‌ను బయటకు వచ్చి డైలర్‌ ఓపెన్ చేసి కాల్ చేయాల్సి ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే.

2 / 5
అయితే ఇకపై వాట్సాప్‌ను క్లోజ్‌ చేయకుండానే నార్మల్‌ కాల్స్‌ చేసుకునే అవకాశం లభించనుంది. ఇందుకోసమే కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నారు. ‘ఇన్-యాప్ డయలర్ ఫీచర్‌’ని తీసుకొచ్చేందుకు వాట్సాప్‌ సన్నాహాలు చేస్తోంది.

3 / 5
త్వరలోనే అందుబాటులోకి రానున్న ఈ కొత్త ఫీచర్‌ సహాయంతో ఇకపై ఎవరికైనా కాల్ చేయాలంటే వాట్సాప్‌ యాప్ నుంచి ఎగ్జిట్ కావాల్సిన అవసరం ఉండదు. నేరుగా వాట్సప్ నుంచే కాల్స్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఆండ్రాయిడ్ 2.24.13.17 అప్‌డేటెడ్ బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉందని WABetaInfo పేర్కొంది.

4 / 5
వాట్సాప్‌లో కుడిపైపు దిగువన కొత్త ఫ్లోటింగ్ యాక్షన్ బటన్‌ను తీసుకురానున్నారని దీనికి యాక్సెస్ ఇస్తే కాల్స్ సులభంగా చేసుకోవచ్చునని వాట్సప్‌బీటా ఇన్ఫో తెలిపింది.

5 / 5
కాలింగ్‌తో పాటు మెసేజింగ్ షార్ట్‌కట్ డయలర్ స్క్రీన్‌ కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం టెస్టింగ్‌ స్టేజ్‌లో ఉన్న ఫీచర్‌ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు.