- Telugu News Photo Gallery Technology photos Whatsapp introduced whatsapp share feature, check here for how to use this feature
WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ వచ్చేసింది, గమనించారా.? దీని ఉపయోగం ఏంటంటే..
ప్రతీ ఒక్క స్మార్ట్ ఫోన్‌లో కచ్చితంగా ఉండే యాప్‌లో వాట్సాప్ ఒకటిని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఫీచర్స్ తీసుకొస్తున్నారు కాబట్టే వాట్సాప్‌కు ఇంతటి క్రేజ్. ఇతర కంపెనీల నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకునే క్రమంలో అన్ని రకాల ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను పరిచయం చేసింది.
Updated on: Jan 29, 2024 | 9:46 PM

వాట్సాప్ యూజర్ల అవసరానికి అనుగుణంగా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ను ఇప్పుడు వాట్సాప్‌లోనూ ప్రవేశపెట్టింది. ఇంతకీ ఈ ఫీచర్ ఏంటి.? దీని ఉపయోగం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

యూజర్లు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వీడియో కాల్ స్క్రీన్ షేర్ ఫీచర్‌ను వాట్సాప్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్ సహాయంతో ఎవరితోనైనా వీడియో కాల్ మాట్లాడుతున్న సమయంలో మీ స్మార్ట్ ఫోన్ స్క్రీన్‌ను అవతలి వ్యక్తికి షేర్ చేసుకోవచ్చు.

ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలంటే ముందుగా.. మీ వాట్సాప్‌ను ఓపెన్ చేయాలి. అనంతరం డౌన్ డ్రాప్‌కి వెళ్లి అందుబాటులో ఉన్న ట్యాబ్ పై ప్రెస్ చేయండి. ఇప్పుడు కెమెరా స్విచ్ ఆప్షన్ ఇక్కడ అందుబాటులో ఉంటుంది. దాని పై క్లిక్ చేసిన తర్వాత, స్క్రీన్ షేర్ ఫీచర్ సింబల్‌పై క్లిక్ చేయాలి.

వెంటనే మీ ఫోన్‌లో ఒక పాప్ అప్ కనిపిస్తుంది. అనంతరం స్క్రీన్‌ను షేర్ చేయడానికి స్టార్ట్ నౌ పై క్లిక్ చేయాలి. దాంతో స్క్రీన్ షేర్ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. మీరు మీ స్క్రీన్‌ను షేర్ చేసుకుంటున్నారని నిర్ధారించడానికి మీకు ఒక అలర్ట్ వస్తుంది.

గూగుల్ మీట్, జూల్ కాల్స్ వంటి వాటి నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకునేందుకు వాట్సాప్ ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇతర గ్రూప్ కాల్స్‌లో మాదిరిగా మీటింగ్ ప్రారంభించడానికి ముందు షెడ్యూల్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఈ ఫీచర్‌తో మీ ఫోన్‌లోని డేటాను షేర్ చేయవచ్చు.




