
మెటా యాజమాన్యంలోని నంబర్ వన్ అప్లికేషన్ వాట్సాప్, అవసరమైన ఫీచర్లను ప్రవేశపెట్టడం ద్వారా నేడు వినియోగదారులకు ఇష్టమైన యాప్‌గా మారింది. లక్షల మంది దీనిని ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు వాట్సాప్ ఓ షాకింగ్ న్యూస్ ఇచ్చింది.

ప్రస్తుతం ఆండ్రాయిడ్ వాట్సాప్ యూజర్లు తమ చాట్ బ్యాకప్ డేటాను గూగుల్ డ్రైవ్‌లో సేవ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సేవలు ఉచితం. అయితే, 2024 నుండి గూగుల్ డ్రైవ్‌లో ఉచిత అపరిమిత బ్యాకప్‌లను అందించబోమని కంపెనీ తెలిపింది.

ఇకనుంచి వాట్సాప్ బ్యాకప్‌లు పరిమిత స్టోరేజీ కోటాను మాత్రమే పొందుతాయి. Google డిస్క్‌లో అందించిన 15GB స్టోరేజీ పరిమితి మాత్రమే ఉచితంగా అందిస్తుంది. మీరు మరింత స్టోరేజీని పెంచుకోవాలనుకుంటే, కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. చాట్ బ్యాకప్‌ల కోసం Google డిస్క్‌లో స్థలాన్ని కేటాయించాలనే నియమం 2024 ప్రారంభం నుండి అమలులోకి వస్తుంది.

ఇది ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.23.26.7లో నివేదించింది సంస్థ. Google డిస్క్‌లోని WhatsApp బ్యాకప్‌లు ఇకపై అపరిమిత స్టోరేజీని ఉచితంగా అందిందు. మీరు అదనపు స్టోరేజీ కోసం చెల్లించాలి.

వినియోగదారుడు ఎంత స్టోరేజీని ఉపయోగించారో తెలుసుకోవాలంటే, వాట్సాప్ సెట్టింగ్స్‌లో స్టోరేజ్ ఆప్షన్‌ను చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ చాట్ బ్యాకప్ స్టోరేజ్ కోసం ఎంత ఛార్జీలు వసూలు చేస్తుందనే దానిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. దీనికి సంబంధించిన సమాచారం త్వరలో రానుంది.