WhatsApp: మగువల కోసం వాట్సాప్‌ ప్రత్యేక ఫీచర్‌.. పీరియడ్స్‌ ట్రాకింగ్‌ నుంచి ప్రెగ్నెన్సీ వరకు..

|

Jun 27, 2022 | 11:58 AM

WhatsApp: ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటోన్న వాట్సాప్‌ తాజాగా మహిళల కోసమే ప్రత్యేక ఓ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. పీరియడ్స్‌ ట్రాకింగ్, గర్భదారణకు సంబంధించి మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపర్చిందేకు ఈ ఫీచర్‌ తీసుకొచ్చినట్లు..

1 / 5
కేవలం మెసేజ్‌లకు మాత్రమే పరిమితం కాకుండా యూపీఐ పేమెంట్స్‌, రుణాలు ఇలా ఇతర అవసరాలను సైతం తీరుస్తోన్న వాట్సాప్‌ తాజాగా కేవలం మహిళల కోసమే ప్రత్యేకంగా ఓ ఫీచర్‌ను తీసుకొచ్చింది.

2 / 5
మహిళల జీవన ప్రమాణాలను మెరుగు పరచడమే లక్ష్యంగా సిరోనా హైనెనీ ప్రైవేట్ లిమిటెడ్‌ అనే సంస్థతో కలిసి వాట్సాప్‌ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ప్రత్యేక సదుపాయంతో మహిళలు తమ నెలసరి ట్రాకింగ్‌, గర్భదారణ, గర్భదారణ నివారణ వంటి మూడు రకాల సేవలు లభిస్తున్నాయి.

3 / 5
 ఇందు కోసం యూజర్లు ముందుగా +919718866644 నంబర్‌ను ఫోన్‌లో సేవ్‌ చేసుకోవాలి. అనంతరం ఆ నంబర్‌కు హాయ్‌ (Hi) అని మెసేజ్‌ చేయాలి. వెంటనే చాట్‌బోట్‌ మూడు ఆప్షన్స్‌ను చూపిస్తుంది.

4 / 5
అందులో అవసరమైన ఆప్షన్‌ను ఎంచుకొని అక్కడ అడిగే ప్రాథమిక వివరాలను నమోదు చేయాలి. దీంతో మహిళలు తమ నెలసరిని సులువుగా ట్రాక్‌ చేసుకోవచ్చు.

5 / 5
ఈ ఫీచర్‌తో అవాంఛిత గర్భదారణ సమస్యకు చెక్‌ పెట్టడంతో పాటు మహిళల జీవన ప్రమాణాలను మెరుగు పర్చడంలో ఉపయోగపడుతుందని సిరోనా హైజెనీ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ ఫీచర్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారంగా పని చేస్తుంది.