Vivo X100 Pro: వివో నుంచి మరో స్టన్నింగ్ ఫోన్‌… 3డీ డిస్‌ప్లేతో పాటు మరెన్నో ఫీచర్స్‌..

|

Nov 07, 2023 | 10:09 PM

మార్కెట్లోకి రోజుకో కొత్త స్మార్ట్ ఫోన్‌ సందడి చేస్తోంది. దీపావళి సీజన్‌ను టార్గెట్ చేసుకొని కొత్త ఫోన్స్‌ను విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో మరో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. వివో ఎక్స్ 100 ప్రో పేరుతో చైనాలో ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

1 / 5
 చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ వివో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. వివో ఎక్స్ 100 ప్రో పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. నవంబర్‌ 13వ తేదీన ఈ ఫోన్‌ను చైనా మార్కెట్లోకి తీసుకొస్తుండగా, భారత మార్కెట్లోకి ఎప్పుడు తెస్తారన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు.

2 / 5
ఈ స్మార్ట్ ఫోన్‌ను రెండు వేరియంట్స్‌లో తీసుకురానున్నారు. 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌, 16 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్‌, 16 జీబీ ర్యామ్‌, 1 టీబీ స్టోరేజ్ వేరియంట్స్‌లో లాంచ్‌ చేయనున్నారు.

3 / 5
వివో ఎక్స్‌ 100 ప్రో స్మార్ట్ ఫోన్‌లో 6.78 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 2,800 x 1,260 పిక్సెల్స్‌ ఈ స్క్రీన్‌ సొంతం. ఇక ఈ ఫోన్‌లో 4ఎన్‌ఎమ్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 9300 ఎస్‌సోసీ ప్రాసెసర్‌ను అందించారు. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ పనిచేయనుంది.

4 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించనున్నారు. ఇందులో 64 మెగాపిక్సెల్స్‌తో కూడిన ప్రైమరీ కెమెరాతో పాటు, 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెండు కెమెరాలను అందించారు. 100 ఎక్స్‌ డిజిటల్‌ జూమ్‌ ఈ కెమెరా సొంతం. ఇక సెల్ఫీ విషయానికొస్తే ఇందులో 32 మెగాపిక్సెల్స్‌తో కూడి ఫ్రంట్ కెమెరాను అందించారు.

5 / 5
బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 120 వాట్స్‌ వైర్డ్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఇందులో బ్లూటూత్‌ 5.4, వైఫై వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు. శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్‌, నావిక్‌సీ వంటి ఫీచర్లను అందించారు.