
చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. వివో టీ2 ప్రో పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. సెప్టెంబర్ 22న ఫ్లిప్‌కార్ట్ వేదికగా ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రానుంది.

ఈ స్మార్ట్ ఫోన్ ధరకు సంబంధించి కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే నెట్టింట లీక్ అవుతోన్న సమాచారం ఆధారంగా 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 22,000, 256 స్టోరేజ్‌ధర రూ. 23,000 ఉండొచ్చని అంచనా.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.78 ఇంచెస్‌తో కూడిన 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ విత్ 1200 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ డిస్ ప్లే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

ఈ స్మార్ట్ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 7200 ఎస్వోసీ చిప్‌సెట్‌తో పని చేస్తుందని తెలుస్తోంది. ఇక ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4600 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఇవ్వనున్నారు.

కెమెరా విషయానికొస్తే ఇందులో డ్యూయల్ కెమెరా సెటప్‌తో కూడిన రెయిర్ కెమెరా ఇవ్వనున్నారు. ఇందులో 64 మెగాపిక్సెల్+2 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు.