
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో.. వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో పేరుతో ఇప్పటికే చైనాలో ఫోల్డబుల్ ఫోన్‌ను తీసుకురాగా ఈ ప్రొడక్ట్‌కు మంచి ఆదరణ లభించింది. అయితే తాజాగా ఈ ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో పేరుతో తీసుకొస్తున్న ఈ స్మార్ట్ ఫోన్‌ను త్వరలోనే భారత మార్కెట్లోకి లాంచ్ చేయనున్నారు. అయితే ఈ ఫోన్ వచ్చే నెల చివరి నాటికి భారత మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ చిప్‌సెట్ ప్రాసెసర్‌ను అందించనున్నారు. జెయిస్ ఆప్టిక్స్ ట్యూన్‌డ్ కెమెరాను ఇందులో ప్రత్యేకంగా అందింఆచరు. అంతకుముందు వివో ఎక్స్100లో ఇదే టెక్నాలజీని అందించారు.

వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో స్మార్ట్ ఫోన్‌లో 8.03 ఇంచెస్‌తో కూడిన ప్రైమరీ 2కే అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. అలాగే ఇందులో 6.53 ఇంచెస్‌తో కూడిన సెకండరీ డిస్‌ప్లేను ఇచ్చారు. 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్ సొంతం.

ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 16 జీబీ ర్యామ్‌ను అందించారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 64 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను ఇచ్చారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.