Vivo Y28: రూ. 10 వేలలో ఫోన్‌ ప్లాన్‌ చేస్తున్నారా.? వివో నుంచి కొత్త ఫోన్‌ వచ్చేసింది..

|

Jul 09, 2024 | 9:43 AM

బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని రోజుకో కొత్త ఫోన్‌ మార్కెట్లో సందడి చేస్తోంది. ముఖ్యంగా రూ. 10 వేల బడ్జెట్‌లో ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం వివో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. వివో వై28 సిరీస్‌లో భాగంగా వై28 ఎస్‌, వై28ఈ పేర్లతో రెండు కొత్త ఫోన్‌లను తీసుకొస్తున్నారు..

1 / 5
చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం వివో సోమవారం భారత మార్కెట్లోకి రెండు కొత్త ఫోన్‌లను లాంచ్‌ చేసింది. వివో వై28ఎస్‌, వివో వై28ఈ పేర్లతో రెండు కొత్త ఫోన్‌లను తీసుకొచ్చారు. బడ్జెట్‌ ధరలో మంచి ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఇంతకీ ఈ ఫోన్లలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
ధర విషయానికొస్తే వై28 ఎస్‌ 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 13,999కాగా, 6 జీబీ ర్యామ్‌ వేరియంట్‌ ధర రూ. 15,499, 8 జీబీ ర్యామ్‌ వేరియంట్‌ ధర రూ. 16,999గా నిర్ణయించారు. అలాగే వై 28ఈ 4 జీబీ ర్యామ్‌ ధర రూ. 10,999, 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 11,999గా నిర్ణయించారు.

3 / 5
ఫీచర్ల విషయానికొస్తే వివో వై28 సిరీస్ ఫోన్లలో మీడియాటెక్ డైమెన్సిటీ 6100 + 5జీ ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఇక ఈ ఫోన్స్‌లో 6.56 ఇంచెస్‌తో కూడిన ఎల్సీడీ స్క్రీన్‌ను అందించారు. 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌ ఈ స్క్రీన్‌ సొంతం. రెండు ఫోన్లలోనూ 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీని అందించారు.

4 / 5
ఇక వివో వై28 ఎస్‌ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన సోనీ ఐఎంఎక్స్852 రెయిర్ కెమెరాను అందించారు. అలాగే వివో వై28ఈ ఫోన్‌లో 13 మెగా పిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను ఇచ్చారు. ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తాయి.

5 / 5
వీటిలో టీయూవీ రైన్లాండ్ లో బ్లూ లైట్ సర్టిఫికేషన్‌ను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 5 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. కనెక్టివిటీ విషయానిసొస్తే ఈరెండు ఫోన్‌లలోనూ 5జీ, బ్లూటూత్ 5.4, జీపీఎస్, వై-ఫై, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ వంటి ఫీచర్లను అందించారు.