Smartphone: కొత్త ఫోన్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? మార్కెట్లోకి వస్తున్న నయా మాల్‌ ..

Updated on: Feb 29, 2024 | 10:17 PM

రోజురోజుకీ మార్కెట్లో కొంగొత్త ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్‌లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. దీంతో ఏడాదికి ఒక ఫోన్‌ మార్చే రోజులు వచ్చేశాయ్‌. మరి మీరు కూడా ఈ ఏడాది కొత్త ఫోన్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? అయితే ప్రస్తుతం మార్కెట్లోకి కొన్ని ఫోన్‌లు లాంచ్‌ అవ్వడానికి సిద్ధమవుతున్నాయి. ఇంతకీ ఆ స్మార్ట్ ఫోన్స్‌ ఏంటి.? ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

1 / 5
మోస్ట్‌ అవెయిటెడ్‌ స్మార్ట్ ఫోన్స్‌లో నథింగ్ ఫోన్‌ 2ఏ ఒకటి. లండన్‌కు చెందిన నథింగ్‌ ఫోన్‌కు భారత మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తోన్న వేళ. ఈ ఫోన్‌ను బడ్జెట్‌ ధరలో తీసుకొస్తుండడం విశేషం. మార్చి 5న ఈ ఫోన్‌ లాంచ్‌ చేయనున్నారు. ఇందులో డైమెన్సిటీ 7200 ప్రో చిప్‌సెట్ ప్రాసెసర్‌ను అందించనున్నారు.

2 / 5
వచ్చే నెలలో వస్తున్న మరో కొత్త స్మార్ట్ ఫోన్‌ సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఏ55. ఈ ఫోన్‌ను మిడ్‌ రేంజ్‌ బడ్జెట్‌లో తీసుకురానున్నారు. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఏ55 స్మార్ట్ ఫోన్‌ ఎగ్జినాస్‌ 1480 చిప్‌సెప్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. మార్చి నెల చివరల్లో ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసురానున్నారు.

3 / 5
వచ్చే నెలలో మార్కెట్లోకి వస్తున్న కొత్త ఫోన్స్‌లో షావోమీ 14 ఒకటి. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను మార్చి 7వ తేదీన మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ చిప్‌సెట్‌ ప్రాసెసర్‌ను అందించానున్నారు. ఈ ఫోన్‌లో 6.36 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను అందించనున్నారు. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ చేయనుంది.

4 / 5
వచ్చే నెలలో మార్కెట్లోకి సందడి చేయడానికి వస్తున్న మరో స్మార్ట్ ఫోన్‌లో వివో వీ30. ఈ ఫోన్‌ను మార్చి సెకండాఫ్‌లో మార్కెట్లోకి తీసుకురానున్నారు. వివో వీ30 స్మార్ట్ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్‌ 7జెన్‌ 3 చిప్‌సెట్‌ ప్రాసెసర్‌ను అందించనున్నారు.

5 / 5
మార్చి నెలలో లాంచింగ్‌కు సిద్ధమైన మరో స్మార్ట్ ఫోన్‌ ఐక్యూజెడ్‌9. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను మార్చి 12వ తేదీన మార్కెట్లోకి లాంచ్‌ చేయనున్నారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో 6000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించానున్నారు.