Uber: ఉబర్‌లో ఆసక్తికర ఫీచర్లు.. వీటి ఉపయోగం ఏంటంటే..

|

Nov 15, 2024 | 1:24 PM

ప్రముఖ క్యాబ్‌ సర్వీస్‌ సంస్థ కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. మార్కెట్లో నెలకొన్న పోటీ నేపథ్యంలో ఈ ఫీచర్లను పరిచయం చేసింది. డ్రైవర్ల అనుభవాన్ని మెరుగుపరిచేందుకు ఉబర్‌ ఇండియా నవంబర్ 14వ తేదీన పలు కొత్త ఇన్‌ యాప్‌ ఫీచర్లను తీసుకొచ్చింది. ఇంతకీ ఏంటీ ఫీచర్లు.? వీటి ఉపయోగం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
ఉబర్‌లో ప్రస్తుతం 10 లక్షల మందికి పైగా డ్రైవర్లు పనిచేస్తుంది. భారత్‌లో ఉబర్‌కు సుమారు 1.7 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. ప్రస్తుతం దేశంలోని 125 నగరాల్లో ఉబర్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి.

2 / 5
 అత్యవసర సమయంలో డ్రైవర్లు తమ లైవ్‌ ట్రిప్‌ లొకేషన్‌ వివరాలను స్థానిక పోలీసులతో షేర్ చేసుకునే ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఈ ఫీచర్‌ ప్రస్తుతం తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌తో పాటు మహారాష్ట్రాలో అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలోనే ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు.

3 / 5
ఇక మహిళా డ్రైవర్ల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఉబెర్ యాప్‌లో మహిళా రైడర్ ప్రాధాన్యత ఫీచర్‌ను ప్రారంభించింది. మహిళా డ్రైవర్లు రాత్రి సమయంలో కేవలం మహిళా ప్రయాణికులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వొచ్చు. ఈ ఫీచర్‌ ఇప్పటికే అన్ని ప్రధాన నగరాల్లో అందుబాటులోకి వచ్చింది.

4 / 5
ద్విచక్ర వాహనదారుల కోసం హెల్మెట్ వెరిఫికేషన్ ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఇందులో డ్రైవర్లు హెల్మెట్ ధరించి సెల్ఫీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఉబెర్‌ డ్రైవర్లు, రైడర్స్‌ కోసం ఆడియా రికార్డింగ్ ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ రికార్డింగ్ పూర్తిగా ఎన్‌క్రిప్ట్ అవుతుంది. కేవలం డ్రైవర్‌ గ్యాడ్జెట్‌లోనే సేవ్‌ అవుతుంది.

5 / 5
ఇక ఉబర్‌ డ్రైవర్ల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో ఇన్‌ యాప్‌ టిప్పింగ్ సౌకర్యాన్ని ప్రారంభించింది. దీని ద్వారా రైడర్‌లు రద్దీ సమయాల్లో వేగంగా పికప్ చేసినందుకు డ్రైవర్‌కు రివార్డ్ చేయవచ్చు. అలాగే డ్రైవర్లు యూపీఐ ద్వారా తమ ఆదాయాలను వెంటనే స్వీకరించే సదుపాయాన్ని అందించారు.