
ఐక్యూ Z10x: ఎక్కువ సేపు ఆడే గేమర్‌లకు, ఎక్కువ వాడే వారికి ఇది బెస్ట్ ఫోన్. 6500mAh భారీ బ్యాటరీ, వేగంగా ఛార్జింగ్, 120Hz స్పీడ్‌తో పనిచేసే స్క్రీన్, డైమెన్సిటీ 7300 మంచి ప్రాసెసర్‌తో పాటు యాప్‌లను వేగంగా లోడ్ చేయడానికి 128GB/256GB UFS 3.1 స్టోరేజ్‌ను కలిగి ఉంది. ఫోటోగ్రఫీ కోసం 50MP బ్యాక్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

ఇన్ఫినిక్స్ నోట్ 50s: స్టైలిష్ లుక్, మంచి స్క్రీన్ ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఫోన్. ఈ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో పూర్తి HD+ 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉండటం విశేషం. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్‌తో పాటు 8GB ర్యామ్, 256GB వరకు UFS 2.2 స్టోరేజ్ ఉంది. 64MP డ్యూయల్ రియర్ కెమెరా, 13MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 10W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది

ఒప్పో K13: బ్యాటరీ గురించి అసలు ఆలోచించకుండా వాడాలి అనుకునే వారికి ఇది చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ బ్రైట్‌నెస్‌తో FHD+ అమోల్డ్ స్క్రీన్‌ను అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్, 8GB ర్యామ్, UFS 3.1 స్టోరేజ్‌తో వస్తుంది. ఫోటోల కోసం 50MP డ్యూయల్ రియర్ కెమెరా, 16MP ముందు కెమెరా ఉన్నాయి. దీని అతిపెద్ద ఆకర్షణ 7,000mAh బ్యాటరీ, ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో అందుబాటులోకి వచ్చింది.

టెక్నో పోవా 7: తక్కువ ధరలో మంచి పనితీరు, అన్ని ఫీచర్లూ బ్యాలెన్స్‌డ్‌గా కావాలనుకునే వారికి ఇది మంచి ఛాయిస్. ఇది 6.78 ఇంచెస్, ఫుల్ హెచ్‌డీ స్క్రీన్, 144Hz రిఫ్రెష్ రేట్, 900 నిట్‌ల వరకు బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. డైమెన్సిటీ 7300 అల్టిమేట్ చిప్‌సెట్, 8GB ర్యామ్‌తో స్థిరమైన పనితీరు అందిస్తుంది. ఫోటోగ్రఫీకి 50MP మెయిన్ కెమెరా, 13MP సెల్ఫీ షూటర్ ఉన్నాయి. రోజువారీ కార్యకలాపాలకు, సోషల్ మీడియా వాడకానికి ఈ ఫోన్ చాలా మన్నికైనది.

హానర్ X7C: పెద్ద స్క్రీన్, రోజంతా వచ్చే బ్యాటరీ ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఈ ఫోన్ 6.8 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ TFT LCD డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్, 850 నిట్స్ బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంది. మ్యాజిక్ OS 8 ఆధారిత ఆండ్రాయిడ్ 14పై నడుస్తుంది. 5,200mAh బ్యాటరీ 35W ఫాస్ట్ ఛార్జర్‌ను కలిగివుంది. స్ట్రీమింగ్ వీడియో కాల్స్ కోసం ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.