మీ స్మార్ట్ ఫోన్‌లో ఇంటర్నెట్ డేటా ఏ కారణం లేకుండా త్వరగా ఖర్చవుతోంది అంటే మీ ఫోన్ హ్యాక్‌కి గురైనట్లు అర్థం చేసుకోవాలి. సైబర్ నేరగాళ్లు మీ ఫోన్‌ను హ్యాక్ చేసి బ్యాగ్రౌండ్‌లో ఫోన్‌ను ఆపరేట్ చేస్తుంటారు. దీంతో డేటా వేగంగా ఖర్చవుతుంది
ఫోన్‌లో ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్న సమయంలో అదే పనిగా ఏదో ఒక పాపప్‌లు వస్తుంటే కూడా వెంటనే అలర్ట్ కావాలి. ఇది కూడా మీ ఫోన్ హ్యాక్‌కి గురైనట్లు అర్థం చేసుకోవాలి. ఇలాంటి సమయాల్లో వచ్చే ఎలాంటి పాపప్‌లను కూడా ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయకూడదని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.
ఇక మీ ప్రమేయం లేకుండా స్మార్ట్ ఫోన్‌లో కొత్త యాప్స్ ఏవైనా డౌన్‌లోడ్ అయితే మీ ఫోన్ హ్యాకింగ్‌కు గురైందని అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో జాగ్రత్తగా ఉండాలి.
ఇక ఫోన్‌ను ఉపయోగించకపోయినా వేడెక్కుతుంటే కూడా ఫోన్ హ్యాక్‌కి గురైనట్లు అర్థం చేసుకోవాలి. హ్యాకింగ్‌కి గురైన ఫోన్ బ్యాగ్రౌండ్‌లో రన్ అవుతుంది. కాబట్టి మీకు తెలియకుండానే వేడిగా మారుతుంది.
అలాగే కొన్ని అదే పనిగా తెలియని మెసేజ్‌ల నుంచి స్పామ్ కాల్స్ వస్తున్నా, మెసేజ్‌లు వస్తున్నా వెంటనే అలర్ట్ అవ్వాలి. అలాగే.. మనకు తెలియకుండానే స్క్రీన్‌లాక్, యాంటీవైరస్ వంటి భద్రతా ఫీచర్లు డిసేబుల్ అయితే కూడా హ్యాక్ అయినట్లు భావించాలి.