Smartphone: హ్యాంగ్ అవుతోన్న ఫోన్‌తో చిరాకుగా ఉంటోందా.? ఇలా చేయండి..

|

Aug 04, 2024 | 11:49 AM

స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసిన కొత్తలో ఉన్నంత వేగం ఆ త‌ర్వాత ఉండ‌దు. కాల‌క్ర‌మేణ ఫోన్ వేగం త‌గ్గ‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మైన విష‌యం . పోన్‌లో క్యాచీ మెమోరీ పెర‌గ‌డం, యాప్స్ వాడ‌కం పెర‌గ‌డం కార‌ణంగా ఫోన్ హ్యాంగ్ అవుతుంది. అయితే ఫోన్ హ్యాంగ్ కాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
కొన్ని సంద‌ర్భాల్లో మ‌నం ఫోన్‌లో అవ‌స‌రం లేని యాప్స్‌ను కూడా ఇన్‌స్టాల్ చేసి ఉంచుతాం. ఎప్పుడో కానీ ఉప‌యోగ‌ప‌డ‌ని యాప్స్ ఫోన్‌లో ఉండ‌డం అన‌వ‌స‌రం కాబ‌ట్టి. అలాంటి యాప్స్‌ను అన్ఇన్‌స్టాల్ చేసి కేవ‌లం అవ‌స‌రం ఉన్న‌ప్పుడు మాత్ర‌మే ఇన్‌స్టాల్ చేసుకోవ‌డం వ‌ల్ల ఫోన్ వేగం పెరుగుతుంది.

2 / 5
ఇక ఫోన్ వేగం త‌గ్గ‌డానికి మ‌రో ప్ర‌ధాన కార‌ణం అందులోని క్యాచీ మెమోరీ.. క్యాచీ మెమోరీ పెర‌గ‌డం వ‌ల్ల ఫోన్ స్లోగా మారుతుంది. కాబ‌ట్టి ఎప్ప‌టిక‌ప్పుడు క్యాచీ మెమోరీని డిలీట్ చేస్తూ ఉండాలి. సెట్టింగ్స్‌లోకి వెళ్లి, ఫోన్ సెట్టింగ్‌లో ఉండే క్యాచీ మెమోరీని డిలీట్ చేస్తుండాలి. ఇలా చేస్తే ఫోన్ వేగం పెరుగుతుంది.

3 / 5
ఫోన్‌లో లేటెస్ట్ వెర్ష‌న్ సాఫ్ట్ వేర్ ఉండ‌డం వ‌ల్ల కూడా ఫోన్ వేగం పెరుగుతుంది. కాబ‌ట్టి ఎప్ప‌టిక‌ప్పుడు మీ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. మ‌న‌లో చాలా మంది ఫోన్‌తో వ‌చ్చిన ఓఎస్‌ను ఉప‌యోగిస్తుంటారు. అయితే ఉచితంగా లేటెస్ట్ వెర్ష‌న్‌కు అప్‌డేట్ చేసుకునే అవ‌కాశం ఉంటుంది. ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా ఫోన్ వేగం పెరుగుతుంది.

4 / 5
ఇక మీ ఫోన్ మ‌రీ నెమ్మ‌దిగా మారితే ఫ్యాక్ట‌రీ రీసెట్ చేయ‌డ‌మే బెస్ట్ ఆప్ష‌న్‌గా చెప్పొచ్చు. సెట్టింగ్స్‌లోకి బ్యాక‌ప్ అండ్ రీసెట్‌పై క్లిక్ చేయాలి. అయితే ఇలా చేయ‌డం వ‌ల్ల మీ ఫోన్‌లోని స‌మాచారం అంతా ఎరేజ్ అవుతుంది. అందుకే ముందుగా మీ ఫోన్‌ల‌నీ డేటాను బ్యాక‌ప్ చేసుకోవాలి.

5 / 5
స్మార్ట్‌ఫోన్‌లో ఇంట‌ర్న‌ల్ మెమోరీ ఫుల్ అయినా ఫోన్ నెమ్మ‌దిగా మారే అవ‌కాశం ఉంటుంది. కాబ‌ట్టి ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ ఫ్రీగా ఉండేలా చూసుకోవాలి. అవ‌స‌ర‌మైతే మీ ఫోన్‌లోని ఫొటోలు, వీడియోల‌ను పెన్ డ్రైవ్‌, ల్యాప్‌టాప్ వంటి వాటిలోకి బ్యాక‌ప్ చేసుకొని డిలీట్ చేస్తే స‌రిపోతుంది.